Dussehra Fight: చిరూ.. ఈ సారి ఏమవుతుంది!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dussehra Fight:టాలీవుడ్ టాప్ స్టార్స్ అనగానే ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఆ నలుగురే గుర్తుకు వస్తారు. ఆ తరువాతే నవతరం కథానాయకులను లెక్కిస్తారు. అంతలా అలరించారు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్. యంగ్ హీరోస్ కు కూడా పోటీ ఇస్తూ సాగుతున్న స్టార్స్ ఎవరంటే చిరంజీవి, బాలకృష్ణ అనే చెప్పాలి. అప్పుడప్పుడూ నాగ్, వెంకీ కూడా మెరుపులు మెరిపిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ సారి దసరాకు చిరంజీవి, నాగార్జున మధ్య పోటీ నెలకొనడం చర్చనీయాంశమయింది. ఎందుకంటే ఈ నలుగురు టాప్ స్టార్స్ లో క్లోజ్ ఫ్రెండ్స్ అంటే చిరంజీవి, నాగార్జునే అని సినీజనమే కాదు సామాన్య జనం కూడా చెబుతారు. అలాంటి చిరు, నాగ్ మధ్యే బాక్సాఫీస్ వార్ కు తెరలేవడం నిజంగా విశేషమే! నిజానికి వీరిద్దరి మధ్య పోటీయే ఉండదని అందరూ అనుకున్నారు. కానీ, వీరిద్దరి సినిమాలు ఒకే రోజున జనం ముందుకు వస్తూ ఉండడం అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.
నిజానికి టాప్ స్టార్స్ మధ్య బాక్సాఫీస్ వార్ పండగ సందర్భాల్లోనే సాగుతూ ఉంటుంది. చిరంజీవి కూడా ఇతర టాప్ స్టార్స్ తో పండగ సందర్భాల్లోనే పోటీపడ్డారు. ఆయన సినిమాతో తొలిసారి బాక్సాఫీస్ బరిలో ఒకే రోజున దూకిన స్టార్ హీరో ఎవరంటే వెంకటేశ్! 1988లో చిరంజీవి ‘మంచిదొంగ’, వెంకటేశ్ ‘రక్తతిలకం’ రెండు సినిమాలు జనవరి 14న సంక్రాంతి సంబరాల్లో పోటీ పడ్డాయి. ఆ పోటీలో రెండు సినిమాలు జనాన్ని అలరించినా, చిరంజీవిదే పైచేయిగా సాగింది. ఆ తరువాత 2001 జనవరి 11న మళ్ళీ సంక్రాంతి సంబరాల్లోనే చిరంజీవి, మరో మాస్ హీరో బాలకృష్ణతో పోటీ అనివార్యమయింది. ఆ రోజున విడుదలైన చిరంజీవి ‘మృగరాజు’ కంటే బాలకృష్ణ ‘నరసింహనాయుడు’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. మళ్ళీ ఇన్నాళ్ళకు ఒకే రోజున చిరంజీవి మరో స్టార్ హీరో నాగార్జునతో ఢీ కొంటున్నారు. ఈ సారి దసరా పండగకు చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ద ఘోస్ట్’ బాక్సాఫీస్ వార్ లో పోటీకి సై అంటున్నాయి. మరి ఈ సారి ఎవరు బాక్సులు బద్దలు చేస్తారో చూడాలి.
Also Read
- Hanuman Ansh: రూ.452 కోట్లు కొల్లగొట్టినా ఎవరూ పట్టించుకోలేదు.. ‘హనుమాన్ అంశ్’ డైరెక్టర్ అసంతృప్తి!
- Shiva Kandukuri Marriage: టాలీవుడ్లో పెళ్లిళ్ల సందడి.. పెళ్లిపీటలెక్కబోతున్న మరో హీరో!
- Chiranjeevi Letter: మెగాస్టార్ చిరంజీవి లేఖ.. అమిత్ షాకు అందజేసిన కిషన్ రెడ్డి!
- Ramayana Part 2: రణ్‌బీర్, యష్ కాదు.. పార్ట్ 2లో ప్రధాన ఆకర్షణ ఆయనే.. ఆసక్తికర విషయాలు చెప్పిన అజింక్య!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి షాపుల్లో అవి కూడా..
-
Ind Vs Nepal: నేపాల్‌పై భారత్-ఏ భారీ విజయం.. 306 పరుగుల తేడాతో వరల్డ్ రికార్డు బద్దలు..
-
Student Suicide : శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య.. విద్యార్థి సంఘాల ఆందోళన..
-
OTR: రాజమహేంద్రవరం వైసీపీలో వెన్నుపోట్ల కలకలం
-
OTR: ఉరుములేని పిడుగులా ఆశిష్ షెలార్ ఎంట్రీ.. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!