Durefishan Saleem: పాక్ నటి డేటింగ్ రూమర్స్.. యూట్యూబర్‌తో పెళ్లి వార్తలపై మేకప్ ఆర్టిస్ట్ షాకింగ్ రియాక్షన్

Durefishansaleem

Durefishansaleem

Durefishan Saleem: సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ మీద సోషల్ మీడియాలో తరచూ రూమర్లు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా డేటింగ్, పెళ్లికి సంబంధించిన రూమర్లు షికారు నిమిషాలలోనే షికార్లు చేస్తుంటాయి. ఇప్పుడు అలాంటి వార్తే పాకిస్తాన్ సినీ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ టెలివిజన్ నటి దురేఫిషన్ సలీమ్ ప్రముఖ యూట్యూబర్, టిక్‌టాకర్ రజబ్ బట్‌తో ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారానికి సంబంధించిన ఒక వ్యాఖ్య ఇప్పుడు మరింత వైరల్‌గా మారింది. కొన్ని ఇన్‌స్టాగ్రామ్ పేజీలు దురేఫిషన్ సలీమ్, రజబ్ బట్ ప్రేమలో ఉన్నారని, ఇద్దరూ వివాహానికి కూడా సిద్ధమవుతున్నారని పేర్కొంటూ పోస్టులు షేర్ చేశాయి. ఈ పోస్టులు క్షణాల్లో వైరల్ కావడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది. అయితే చాలా మంది నెటిజన్లు ఈ వార్తలను ఆధారాలు లేని గాసిప్‌గా కొట్టిపారేశారు.

ఈ వ్యవహారంలో దురేఫిషన్ మేకప్ ఆర్టిస్ట్ యశ్వా అంజుమ్ చేసిన కామెంట్ ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించింది. వైరల్ అవుతున్న పోస్టులలో ఒకదానికి స్పందించిన ఆమె, ఈ వార్త విని తాను పూర్తిగా షాక్ అయ్యానని తెలిపింది. ఇలాంటి వార్తలు చూడకపోయినా, వినకపోయినా బాగుండేదని వ్యాఖ్యానించింది. అంతేకాదు, దురేఫిషన్ ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అస్సలు జరగదని, కోటి సంవత్సరాలు గడిచినా అలాంటి విషయం సాధ్యం కాదని స్పష్టంగా రాసింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో, పెళ్లి వార్తలకు ఎలాంటి నిజం లేదనే అభిప్రాయం మరింత బలపడింది.

అయితే ఇప్పటివరకు ఈ ప్రచారంపై దురేఫిషన్ సలీమ్ కానీ, రజబ్ బట్ కానీ అధికారికంగా స్పందించలేదు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న కథనాలన్నీ ప్రస్తుతం కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. దురేఫిషన్ సలీమ్ 2020లో ‘దిల్ రుబా’ సీరియల్‌తో నటిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ‘కైసీ తేరీ ఖుద్‌గర్జీ’, ‘ఇష్క్ ముర్షిద్’, ‘సన్వాల్ యార్ పియా’ వంటి టెలివిజన్ సీరియల్స్‌తో పాకిస్తాన్‌లో ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నటనకు గాను హమ్ అవార్డ్స్ నామినేషన్లు కూడా అందుకున్నారు.

ఇక రజబ్ బట్ విషయానికి వస్తే, ఆయన పాకిస్తాన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ క్రియేటర్లలో ఒకరు. యూట్యూబ్‌లో తొమ్మిది మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లను కలిగి ఉన్న ఆయన ఫ్యామిలీ వ్లాగ్స్, లైఫ్‌స్టైల్ వీడియోలతో భారీ అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారు. ఇటీవల సొంత లగ్జరీ పెర్ఫ్యూమ్ బ్రాండ్‌ను కూడా ప్రారంభించి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డేటింగ్, పెళ్లి వార్తలపై ఇద్దరిలో ఎవరూ స్పందించకపోవడంతో, అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ ప్రచారాన్ని నిర్ధారించలేమని సినీ వర్గాలు చెబుతున్నాయి.