Dunki : డంకీ ఓటీటీ రిలీజ్ అంటూ వైరల్ అవుతున్న పోస్టర్..వాస్తవం ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ చిత్రం డిసెంబర్ 21న థియేటర్లలో విడుదల అయింది.కామెడీ ఎమోషనల్ మూవీ గా తెరకెక్కిన డంకీ మూవీ షారుఖ్ రేంజ్‍కు తగ్గట్టు ఆశించిన స్థాయిలో భారీ కలెక్షన్లను రాబట్టలేకపోతోంది.బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో డంకీ మూవీ తెరకెక్కింది.. ఈ మూవీకి మొదటి నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. సలార్ మూవీ పోటీలో ఉండడం కూడా డంకీకి ఎదురుదెబ్బగా మారింది. మరోవైపు, డంకీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి నెట్టింట పుకార్లు వైరల్ అవుతున్నాయి.డంకీ మూవీ కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన ‘జియో సినిమా’ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుందని సోషల్ మీడియాలో పుకార్లు వైరల్ అవుతున్నాయి. జియో సినిమానే ప్రకటించిందనేలా ఓ పోస్టర్ తెగ వైరల్ అవుతోంది. అయితే, ఇందులో వాస్తవం లేదు.
జనవరి 1వ తేదీన డంకీ మూవీ ఓటీటీలోకి రావడం లేదు.డంకీ సినిమా జనవరి 1న స్ట్రీమింగ్‍కు వస్తుందనే పోస్టర్ కావాలనే కొందరు క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. ఫ్యాన్స్ వార్ కారణంగా దీన్ని కొందరు బాగా వైరల్ చేస్తున్నారు.. జనవరి 1న డంకీ ఓటీటీ స్ట్రీమింగ్‍కు రావడం లేదు.థియేటర్లలో రిలీజ్ అయిన 8 వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍తో డంకీ సినిమా మేకర్స్ ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది.. ఫిబ్రవరిలో ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు ఉన్నాయి.అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా జనవరి 12వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటూ మరో పోస్టర్ కూడా వైరల్ అవుతోంది. అయితే, అది అధికారిక ప్రకటన మాత్రం కాదు. ఆ ఫేక్ పోస్టర్ మాత్రం నెట్టింట బాగా వైరల్ అవుతుంది.జనవరి 12న సలార్ ఓటీటీలోకి రావడం లేదు. ఈ చిత్రం కూడా ఫిబ్రవరిలోనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఫ్యాన్స్ వార్‌లో భాగంగానే కొందరు ఇలా సలార్, డంకీ ఓటీటీ రిలీజ్‍లపై పోస్టర్లను వైరల్ చేస్తున్నారు
Also Read
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!