Site icon NTV Telugu

Kaantha : దుల్కర్ సల్మాన్ ‘కాంత’ పై ఎం.కె.టి కుటుంబం ఫిర్యాదు..

Kantha Dulkar

Kantha Dulkar

దుల్కర్‌ సల్మాన్‌, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ‘కాంత’ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉండగా, అనుకోని వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రం తమ తాత ఎం.కె.త్యాగరాజ భాగవతార్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసారని, ఎలాంటి అనుమతి లేకుండా కథను వాడారని ఆయన మనవడు బి.త్యాగరాజన్‌ చెన్నై సివిల్‌ కోర్టులో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కోర్టు నవంబర్‌ 18లోపు సమాధానం ఇవ్వాలని చిత్ర యూనిట్‌ను ఆదేశించింది. దీంతో సినిమా రిలీజ్‌పై అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే తెలుగు, తమిళ వెర్షన్లకు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభమైనందున అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : The Raja Saab : ‘రాజాసాబ్’ కొత్త పోస్టర్ హల్‌చల్!

ఈ వివాదంపై హీరో దుల్కర్‌ సల్మాన్‌ స్పందిస్తూ, “మా సినిమా పూర్తిగా ఎం.కె.టి గారి బయోపిక్‌ కాదు. ఆయన జీవితంలోని కొన్ని అంశాలు మాకు ప్రేరణగా నిలిచాయి. కథలో ఎక్కువ భాగం కల్పితం. ఇది కేవలం కళాకారుడి ఈగో వార్‌, సృజనాత్మక పోరాటం చుట్టూ తిరిగే కథ మాత్రమే” అని తెలిపారు. అయితే దర్శకుడు చెప్పిన ఈగో వార్‌ వ్యాఖ్యలతో సినిమా నిజంగా ఎం.కె.టి జీవితాన్ని ప్రతిబింబిస్తోందా అన్న చర్చ మొదలైంది.

1930-40 దశకాల్లో తమిళ సినీ పరిశ్రమలో అగ్రగామిగా నిలిచిన ఎం.కె.త్యాగరాజ భాగవతార్‌ తక్కువ సినిమాలు చేసినా, అన్నీ హిట్స్‌ కావడం విశేషం. గాయకుడిగా, నటుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడు ఓ హత్య కేసులో ఇరుక్కోవడం, జైలుకెళ్లడం వంటి సంఘటనలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఇప్పుడు ‘కాంత’ కథలో కూడా ఇలాంటి సన్నివేశాలుంటే, అవి ఏ మేరకు ఆయన జీవితం ఆధారంగా తీశారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక నిర్మాత రానా దగ్గుబాటి, హీరో దుల్కర్‌ సల్మాన్‌ ఇప్పుడు ఈ కేసుతో పెద్ద టెన్షన్‌లో ఉన్నారు. కోర్టు అనుమతి లేకుండా సినిమాను రిలీజ్‌ చేసే అవకాశం లేదని ఇండస్ట్రీ టాక్‌. ఈ నేపథ్యంలో సినిమా అనుకున్న సమయానికే థియేటర్లలోకి వస్తుందా లేదా అన్నది చూడాలి. మొత్తానికి, సినిమా రిలీజ్‌ కాకముందే ‘కాంత’పై కాంతివంతమైన వివాదం మొదలైందని చెప్పొచ్చు.

Exit mobile version