NTV Telugu Site icon

Druva Nakshatram Trailer: విక్రమ్ స్టైల్.. గౌతమ్ మీనన్ టేకింగ్.. వేరే లెవెల్ అంతే

Vikram

Vikram

Druva Nakshatram Trailer: వర్సెటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ధృవ నక్షత్రం. రీతూవర్మ హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించాడు. ఓండ్రగ ఎంటర్ టైన్ మెంట్, ఒరువూరిలియోరు ఫిల్మ్ బ్యానర్స్ పై నిర్మిస్తూ రూపొందిస్తున్నారు. రెండు భాగాలుగా తెరపైకి రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ధృవ నక్షత్రం, ఛాప్టర్ 1 యుద్ధకాండం ఈ నెల 24న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. దాదాపు ఐదేళ్ల నుంచి ఈ రిలీజ్ కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా నవంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.

Madhavi Latha: రష్మిక ఫేక్ వీడియోపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు.. ఆమె వేసుకునే డ్రెస్సుల కంటే అసభ్యమా?

ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముంబైపై టెర్రరిస్ట్ దాడి జరిగినప్పుడు అప్పటి ఎన్ఎస్ జీ టీమ్ లో ఉన్న ఓ సీనియర్ ఆఫీసర్ తమ వృత్తిలోని సవాళ్లను గురించి మరో వ్యక్తికి చెబుతుంటాడు. చట్టంలోని రూల్స్ రెగ్యులేషన్స్ ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో తమకు అడ్డుగా మారుతున్నాయని, అందుకే చట్టంతో పనిలేని బేస్ మెంట్ అనే ఓ కోవర్ట్ టీమ్ ను తయారు చేసినట్లు ఆ సీనియర్ ఆఫీసర్ వెల్లడిస్తాడు. క్రికెట్ టీమ్ లా 11 మంది ఉండే బేస్ మెంట్ కోవర్ట్ టీమ్ లోకి స్పెషలిస్ట్ ఆఫీసర్ గా వస్తాడు జాన్. ఈ కోవర్ట్ టీమ్ తరుపున టెర్రరిస్టులతో జాన్ చేసే పోరాటాన్ని ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. గ్రాండ్ మేకింగ్ వ్యాల్యూస్, హై ఎండ్ యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకున్నాయి. జాన్ క్యారెక్టర్ లో చియాన్ విక్రమ్ కూల్ అండ్ స్టైలిష్ గా కనిపించారు. ఈ సినిమాలో డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఓ కీ రోల్ లో నటించాడు. విక్రమ్ ఎప్పటిలానే స్టైలిష్ కాప్ లా కనిపించాడు. ఇక గౌతమ్ మీనన్ టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్నేళ్ల తరువాత ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Show comments