Site icon NTV Telugu

“దృశ్యం 2” ఫస్ట్ లుక్ కు టైమ్ ఫిక్స్

Drusyam 2 First Look on September 20th

వెంకటేష్ దగ్గుబాటి ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ మూవీ రిలీజ్‌లతో దూసుకుపోతున్నారు. ఆయన ఇటీవల విడుదల చేసిన “నారప్ప” సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఎలాంటి పాత్రనైనా ఈజీగా పోషించగల అరుదైన నటులలో వెంకటేష్ ఒకరు. ఆయన ఇప్పుడు 2014 ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ “దృశ్యం” సీక్వెల్‌గా రాబోతున్న మూవీ “దృశ్యం 2″తో ప్రేక్షకులను అలరించడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

Read Also : శ్రీకాళహస్తిలో సమంత వరుస పూజలు !

వెంకటేష్ ఈ సంవత్సరం ప్రారంభంలో “దృశ్యం 2” షూటింగ్ ప్రారంభించి రెండు నెలల వ్యవధిలో పూర్తి చేశాడు. మహమ్మారి కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమయ్యాయి. తాజాగా ప్రొడక్షన్ హౌస్ ట్విట్టర్ ద్వారా వెంకటేష్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమాలో వెంకటేష్ దగ్గుబాటి నటిస్తున్న రాంబాబు పాత్రకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను సెప్టెంబర్ 20 న ఉదయం 10.08 గంటలకు టైటిల్ తో సహా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

విక్టరీ వెంకటేశ్‌, మీనా జంటగా తెరకెక్కుతున్న ‘దృశ్యం2’ మూవీకి జీతూ జోసెఫ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ బాబు దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని “నారప్ప” కంటే ముందే విడుదల చేయాల్సి ఉంది. అయితే ఓటిటికి వెళ్లాలా లేక థియేటర్లలో విడుదల చేయాలా ? అనే విషయంపై చిత్ర బృందం ఆలోచనలో పడింది. త్వరలో చిత్ర బృందం “దృశ్యం 2” విడుదల తేదీని ప్రకటించనుంది.

Exit mobile version