విక్టరీ వెంకటేష్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఇటీవల విడుదలైన “నారప్ప” ఓటిటిలో స్ట్రీమింగ్ అవ్వడం దగ్గుబాటి అభిమానులకు ఏమాత్రం రుచించలేదు. సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతుందని ఆశించిన వెంకీమామ అభిమానులకు అలా నిరాశ తప్పలేదు. తాజాగా మరోమారు వెంకటేష్ తన అభిమానులను నిరాశ పరిచారు. “దృశ్యం” చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకున్న “దృశ్యం 2” విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాను ఓటిటిలో విడుదల చేయాలా ? థియేటర్స్ లోనా అనే విషయం గురించి మేకర్స్ ఆలోచనలో పడ్డారు.
Read Also : “ఆచార్య” పోస్ట్ పోన్… అసలు కారణం ఇదే !
అది పక్కన పెడితే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు సిద్ధమయ్యారు మేకర్స్. ఈ మేరకు “దృశ్యం 2″లో వెంకటేష్ దగ్గుబాటి నటిస్తున్న రాంబాబు పాత్రకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను సెప్టెంబర్ 20 న ఉదయం 10.08 గంటలకు టైటిల్ తో సహా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం అనుకోని పరిస్థితుల కారణంగా “దృశ్యం 2” ఫస్ట్ లుక్ ఈ రోజు రిలీజ్ చేయడం లేదట. కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నారని తెలుస్తోంది. వెంకటేష్, మీనా జంటగా తెరకెక్కుతున్న ‘దృశ్యం2’ మూవీకి జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ బాబు దీనిని నిర్మిస్తున్నారు.
