Drishyam 3 : అడ్వాన్స్ సేల్స్ లో దూసుకెళ్తున్న దృశ్యం 3.. మోహన్ లాల్ మరో ఇండస్ట్రీ హిట్ ఇస్తాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోహన్‌లాల్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘దృశ్యం’ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మళయాలంలో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు అన్ని పాన్ ఇండియా భాషల్లో రీమేక్ అయి సూపర్ హిట్ అయింది. దానికి సీక్వెల్ గా వచ్చిన దృశ్యం 2 కూడా సూపర్ సెన్సేషన్ హిట్ అయింది. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ ఫ్రాంచైజీ నుండి మూడో పార్ట్ వస్తుంది. తాజాగా దృశ్యం 3 ట్రైలర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
మే 21న రిలీజ్ కానున్న ఈ సినిమా అడ్వాన్స్ సేల్స్ లో దూసుకెళ్తోంది. టికెట్స్ బుకింగ్ ట్రెండ్స్ ప్రకారం కేరళలో ఈ సినిమా అడ్వాన్స్ సేల్స్ కేవలం 10 గంటల్లో 1.50 కోట్ల రూపాయల మార్కును దాటేసింది. కేరళ బాక్సాఫీస్ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో బుకింగ్స్ జరగ లేదు. ఈ అడ్వాన్స్ సేల్స్ ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.కేవలం కేరళలోనే కాకుండాప్రపంచవ్యాప్తంగా ‘దృశ్యం 3’ హవా కొనసాగుతోంది. ఫ్యాన్ షోలతో కలిపి ఇప్పటివరకు ఈ సినిమా రూ. 4.50 కోట్ల గ్లోబల్ ప్రీ-సేల్స్ మార్కును చేరుకుంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లలో (USA, UAE, ఆస్ట్రేలియా) ఈ చిత్రానికి భారీ స్పందన లభిస్తోంది. సినిమా విడుదల కావడానికి ఇంకా 10 రోజులు సమయం మిగిలి ఉంది. ఇప్పుడే ఈ స్థాయిలో బుకింగ్స్ ఉంటే రిలీజ్ నాటికి ఈ గణాంకాలు ఎక్కడికి చేరుతాయో ఊహించలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫైనల్ ప్రీ-సేల్స్ రిపోర్ట్ అన్ని మలయాళ చిత్రాల రికార్డులను తుడిచిపెట్టే అవకాశం కనిపిస్తోంది. మే 21న మోహన్‌లాల్ పుట్టినరోజు కానుకగా వస్తున్న దృశ్యం 3 ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!