మట్టిలోని మాణిక్యాలను వెలికితీసి బుల్లితెరపై మెరిసే అవకాశం కల్పిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న సక్సెస్ఫుల్ షో డ్రామా జూనియర్స్ సరికొత్త సీజన్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లోని పిల్లల్లోని నటనా ప్రతిభను వెలుగులోకి తెచ్చే లక్ష్యంతో డ్రామా జూనియర్స్ సీజన్ 9 ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే విజయవంతంగా 8 సీజన్‌లను పూర్తి చేసుకున్న డ్రామా జూనియర్స్ మరో సీజన్తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రతిభగల పిల్లలని ఆడిషన్స్కి ఆహ్వానిస్తోంది. – డ్రామా జూనియర్స్ సీజన్ 9 కోసం తెలుగు రాష్ట్రాల్లో నటనపై ఆసక్తిగల చిన్నారులకు అద్భుత అవకాశం అందిస్తోంది. 4 నుంచి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు చక్కని అవకాశం. ఈ ఆడిషన్స్ ఆదివారం( ఏప్రిల్ 12న) రోజు, సారథి స్టూడియోస్, అమీర్పేట్, హైదరాబాద్ నందు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు నిర్వహించబడతాయి. ఈ ఆడిషన్స్లో ప్రముఖ నటి రోజా, యాంకర్ సుధీర్ కూడా హాజరై పిల్లలను ప్రోత్సహించనున్నారు.
Drama Juniors : ఏప్రిల్ 12న డ్రామా జూనియర్స్ సీజన్ 9 ఆడిషన్స్

Zee