NTV Telugu Site icon

Double iSmart: డబుల్ ఇస్మార్ట్ నైజాం వివాదం.. అసలు సంగతి ఏమిటంటే?

Double Ismart

Double Ismart

Double iSmart: డబుల్ ఇస్మార్ట్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో సూపర్ హిట్గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి ఈ సినిమాని సీక్వెల్ గా తెరకెక్కించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా కావ్య థాపర్ హీరోయిన్గా ఈ సినిమాని చార్మి నిర్మించారు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో ఇప్పటికే ప్రమోషన్స్ వేగం పెంచారు. కొన్ని సాంగ్స్ రిలీజ్ చేస్తే అవన్నీ కూడా సూపర్ హిట్గా నిలిచాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక వివాదం తెర మీదకు వచ్చింది. అదేంటంటే నైజాం ఏరియాలో ఈ సినిమా రిలీజ్ కాకుండా అక్కడి డిస్ట్రిబ్యూటర్లు అనధికార బ్యాన్ విధించే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో ఈరోజు ఉదయం మీటింగ్ కూడా జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి కొనుగోలు చేశారు. ఈ నేపద్యంలో లైగర్ నష్టాలు పూడ్చకుండా వరంగల్ శీనుకి ఈ సినిమా హక్కులు ఇవ్వకుండా రిలీజ్ చేస్తున్నారు.

Also Read: Chiranjeevi: గద్దర్ అవార్డుల పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. చిరంజీవి కీలక ట్వీట్

దీంతో వరంగల్ శీను ప్రమేయంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని అనధికారికంగా బ్యాన్ చేయాలని ఆలోచనతో మీటింగ్ కూడా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీని వెనుక అసలు కారణం ఏమిటనేది ఆరా తీస్తే పూరి కాంపౌండ్ వర్గాల నుంచి కొన్ని ఆసక్తికర వార్తలు తెలిశాయి. అదేమంటే వరంగల్ శీను లైగర్ సినిమా విషయంలో పూరి, చార్మికి కమిట్మెంట్ ఫుల్ ఫిల్ చేయలేదని తెలుస్తోంది. అంటే ఏ రేటుకైతే లైగర్ సినిమాను తాను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చాడో ఆ రేటు పూర్తిగా చెల్లించలేదని చెబుతున్నారు. లైగర్ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలలో వరంగల్ శ్రీను డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఈ క్రమంలోనే డిస్ట్రిబ్యూటర్లకు బాకీ పడ్డాడని తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు ఏమైనా నష్టపోతే అడగాలి కానీ వరంగల్ శీనుకి అడిగే హక్కు లేదని పూరి కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న సమాధానం. నిజానికి ఇదే విషయం మీద పూరి జగన్నాథ్ కూడా ఒకటి రెండు లేఖలు రాశారు. సినిమా అనేది వ్యాపారం అని సినిమాల వల్ల లాభపడినప్పుడు లాభాలు పంచడం లేదు అలాంటప్పుడు నష్టపోయినప్పుడు నష్టాలు తీర్చమని కోరే హక్కు ఎక్కడిది అనే వాదనలు వినిపిస్తున్నాయి.