Site icon NTV Telugu

Dolly D Cruze aka Gayathri : యాక్సిడెంట్ లో నటి మృతి

Gayatri

Dolly D Cruze aka Gayathri : యూట్యూబర్, నటి డాలీ నిన్న రాత్రి గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రముఖ నటి సురేఖా వాణి వెల్లడించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో డాలీతో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేసుకుంటూ “డాలీ ఇది అన్యాయం… నమ్మడానికి కష్టంగా ఉంది… నీతో నాకు అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. అసలు మాటలు రావడం లేదు… టోటల్లీ బ్లాంక్” అంటూ పోస్ట్ చేసింది. ఇక ఆమె కన్ను మూసిందన్న విషయం తెలిసిన వారు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

Read Also : Penny Song : “సర్కారు వారి పాట” సెకండ్ సింగిల్ ప్రోమో… సర్ప్రైజ్ అదుర్స్

విషయంలోకి వస్తే… డాలీ అసలు పేరు గాయత్రీ. ఇండస్ట్రీలో జూ.ఆర్టిస్ట్‌ గా పని చేస్తున్న ఆమె నిన్న రాత్రి గచ్చిబౌలి వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మరణించింది. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆమెతో పాటు రోహిత్‌ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. రోహిత్‌ తో గాయత్రికి గత కొన్నాళ్ల నుంచి ఫ్రెండ్షిప్ ఉన్నట్టుగా తెలుస్తోంది. నిన్న హోలీ పండగ సందర్భంగా గాయత్రి ఇంటికి వెళ్లి పికప్‌ చేసుకున్నాడు రోహిత్‌. ఆ తరువాత ఇద్దరూ కలిసి ప్రిసంపబ్‌లో పార్టీ చేసుకున్నారు. పార్టీ అనంతరం ఇద్దరూ ఇంటికి బయలుదేరగా ప్రమాదం జరిగింది. గాయత్రి కారును డ్రైవ్‌ చేయగా, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ఇక ప్రమాదంలో గాయత్రి మరణించగా, రోహిత్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను AIG లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్టు సమాచారం.

Exit mobile version