మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. శంకర్ చేస్తున్న మొదటి తెలుగు సినిమా కావడం, దిల్ రాజు నిర్మిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా రావడంతో ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా గమించాయి. దానికి తోడు ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద ఆసక్తి పెంచడంతో సినిమా ఎలా ఉంటుందో అని మెగా ఫాన్స్ తో పాటు సినీ ప్రేమికులు కూడా ఎదురుచూస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
Also Read : Triptii Dimri : క్రేజీ ప్రాజెక్ట్ నుంచి త్రిప్తి దిమ్రిని తప్పించిన నిర్మాతలు.. కారణం ఇదే..?
కాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని నేడు సినిమా రిలీజ్ టైటిల్ కార్డ్స్ లో ప్రకటించారు మేకర్స్. గేమ్ ఛేంజర్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది ఆమెజాన్ ప్రైమ్. అయితే సినిమా రిలీజ్ అయిన ఎనిమిది వారాలు తర్వాత స్ట్రీమింగ్ చేసేలా అగ్రిమెంట్ చేసారట. కాగా నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటనకు అద్భుత స్పందన లభిస్తుంది. ముఖ్యంగా అప్పన్న క్యారక్టర్ లో రామ్ చరణ్ నటన అటు అభిమానులతో పాటు ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తోంది. శంకర్ గ్రాండియర్ గా సినిమాను తెరకెక్కించాడని, జరగండి సాంగ్ ఓ రేంజ్ లో ఉందని కామెంట్స్ చేస్తున్నారు.