NTV Telugu Site icon

Ramoji Rao: రామోజీరావు నటించిన సినిమా ఏదో తెలుసా?

Ramoji Rao Acted In Marpu Movie

Ramoji Rao Acted In Marpu Movie

Ramoji Rao Acted in Marpu Movie : రామోజీరావు ఈనాడు సంస్థల అధినేతగా, మార్గదర్శి ప్రియా పచ్చళ్ళ వ్యాపారాలు చేసే వ్యాపారవేత్తగానే చాలా మందికి తెలుసు. అలాగే ఆయన ఉషా కిరణ్ మూవీస్ అనే నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి సుమారు 85 పైగా సినిమాలను నిర్మించారు. అయితే ఆయన నిర్మాతగానే సినిమాలకు తన తోడ్పాటు అందించారని చాలామంది అనుకుంటారు. కానీ ఆయన ఒక సినిమాలో కూడా నటించారు. చిన్నప్పటి నుంచి స్వతహాగా సినిమాలంటే చాలా ఇష్టపడే రామోజీరావు ఒక సినిమాలో చిన్న అతిథి పాత్రలో నటించారు.

Ramoji Rao: మేరు పర్వతం .. దివి కేగింది.. రామోజీరావుకి చిరు, బాలయ్య అశ్రునివాళి

1978లో యు విశ్వేశ్వర రావు నిర్మించిన మార్పు అనే సినిమాలో రామోజీరావు ఒక న్యాయమూర్తి పాత్రలో నటించారు. ఆయన నటించింది అతిథి పాత్రలోనే అయినా సినిమా పోస్టర్ లపై రామోజీరావు బొమ్మ అప్పట్లో ప్రచురించడం హాట్ టాపిక్ అయింది. ఇక రామోజీరావు మరణం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు సైతం దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ సైతం రామోజీరావుకి నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. ఇక ఆయన పార్థివ దేహాన్ని ఫిలిం సిటీలో ఉన్న నివాసానికి తరలించగా సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు తరలి వచ్చి చివరి చూపు చూసి నివాళులు అర్పిస్తున్నారు.

Show comments