Site icon NTV Telugu

Naga Chaitanya: దాని కోసం బాబు ఎంత రిస్క్ అయిన చేస్తాడంట..?

Dhootha

Dhootha

Naga Chaitanya:  అక్కినేని హీరో నాగ చైతన్య భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.  ఎన్నో ఆశలతో లాల్ సింగ్ చద్దా సినిమాతో అడుగుపెట్టాడు. కానీ, అది కూడా పరాజయాన్ని చవిచూసింది. ఇక ప్రస్తుతం చై ఆశలన్నీ కస్టడీ, దూత సినిమాల మీదే ఉన్నాయి. ముఖయంగా దూత వెబ్ సిరీస్ మీదనే చై ఆశలన్నీ పెట్టుకున్నాడు. విక్రమ్ కె కుమార్ తెరకెక్కిస్తున్న ఈ  సిరీస్ లో చై.. బాబు అనే పాత్రలో నటిస్తున్నాడు. మొదటి నుంచి ఈ సిరీస్ లో చైతూ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు అంటూ వార్తలు గుప్పుమన్నాయి.

ఇక తాజాగా ఈ పాత్ర గురించి కెన్నీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సిరీస్ లో చైతన్య.. బాబు అనే జర్నలిస్ట్  గా కనిపించబోతున్నాడు. ఒక కేసు ఇన్వస్టిగేషన్ కోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తాడట. అది నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా పట్టించుకోడట. సిరీస్ మొత్తానికి చై ఇన్వెస్టిగేషనే హైలైట్ అని చెప్పుకొస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఇందులో చై మరో కోణం బయటపడుతుంది అనేది చెప్పొచ్చు. మరి చూడాలి ఈ సిరీస్ తో ఈ అక్కినేని హీరో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో..

Exit mobile version