NTV Telugu Site icon

Akkineni : సూసైడ్ చేసుకోవాలనుకున్న అక్కినేని.. ఎందుకో తెలుసా

Anr

Anr

అక్కినేని నాగార్జున ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవాలో జరుగుతుండగా దానికి హాజరయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా ఈ ఫిలిం ఫెస్టివల్ లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కుమారుడిగా అక్కినేని నాగార్జున పాలు ప్యానల్ డిస్కషన్స్ లో పాల్గొన్నారు. ఇక ఈ ఇంటరాక్షన్స్ లో భాగంగా నాగార్జున తన తండ్రి గురించి తన తండ్రి క్రమశిక్షణ గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. అంతే కాదు ఒకానొక సందర్భంలో అక్కినేని నాగేశ్వరరావు సూసైడ్ చేసుకోవాలి అని అనుకున్నట్టు వెల్లడించారు. తన తండ్రి ఆడవాళ్ళ మేనరిజం కారణంగా చనిపోవాలని అనుకున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.

Also Read: Maharashtra Election Results: ఇక మహారాష్ట్రలో అదానీ ప్రాజెక్టుకు ఉపశమనం?.. ఏంటా ప్రాజెక్ట్?

చెన్నై వచ్చిన కొత్తలో తన తండ్రి ఎక్కువగా స్టేజి మీద ఆడవాళ్ళ పాత్రలు పోషించే వారంట, అప్పట్లో ఆడవాళ్ళ పాత్రలు పోషించే వారి సంఖ్యా ఉండడంతో కాంపిటీషన్ ఉండదని ఆయన అది ఎంచుకున్నారని అయితే ఆడవాళ్ళ వేషాలు వేస్తున్నారని ఆయన మీద పెద్ద ఎత్తున చాలామంది విమర్శలకు గుప్పించే వాళ్ళని చెప్పుకొచ్చారు. ఒకానొక సందర్భంలో చాలా బాధపడి సూసైడ్ చేసుకోవాలని అనుకున్నట్లు వెల్లడించారు. అప్పుడు చెన్నై మెరీనా బీచ్ లోకి వెళ్లి చనిపోవాలని అనుకున్నారని సముద్రంలో దిగి కొంత దూరం వెళ్ళాక లోపల నుంచి చనిపోవద్దు అనే తలంపు కలిగి మళ్లీ వెనక్కి వచ్చారని చెప్పుకొచ్చారు అలా తిరిగి వచ్చిన ఆయన ఇప్పుడు ఇండియాలోనే అతి తక్కువ మంది లెజెండరీ నటలలో ఒకరిగా నిలిచారని వెల్లడించారు. అంతేకాదు తన గొంతుని రఫ్గా తయారు చేసుకునేందుకు ఆయన సిగరెట్లు తాగేవారని అలాగే బీచ్ ఒడ్డుకు వెళ్లి ఐదు నుంచి పది నిమిషాల వరకు గట్టిగా అరిచి తన గొంతు రఫ్ గా తయారు చేసుకునేందుకు ప్రయత్నించారని వెల్లడించారు.

Show comments