NTV Telugu Site icon

Dj Tillu 2: అనుపమ ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్…

Dj Tillu 2

Dj Tillu 2

సిద్ధూ జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ బాక్సాఫీస్ దగ్గర కొట్టిన ‘డీజే’ సౌండ్ ఇంకా వినిపిస్తూనే ఉంది. ‘రాధిక’ అనే పేరుని,’డీజే టిల్లు’ టైటిల్ సాంగ్, సిద్ధూ జొన్నలగడ్డ చెప్పిన డైలాగ్స్ ని ఇప్పటికీ ఆడియన్స్ వాడుతూనే ఉన్నారు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘డీజే టిల్లు’ సూపర్ హిట్ అయ్యి, ఒక క్రేజీ క్యారెక్టర్ ని తెలుగు ఆడియన్స్ కి పరిచయం చేసింది. ఈ సూపర్ క్రేజీ క్యారెక్టర్ ని ఆడియన్స్ కి మరింత దగ్గర చేస్తూ మేకర్స్, ‘డీజే టిల్లు స్క్వేర్’ని అనౌన్స్ చేశారు. ‘డీజే టిల్లు’ సినిమాకి సీక్వెల్ గా ‘డీజే టిల్లు స్క్వేర్’ సినిమా రూపొందుతుంది. ఇప్పటివరకూ 40% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. డీజే టిల్లు స్క్వేర్ అనౌన్స్ అయిన సమయంలో, అనుపమ పరమేశ్వరన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని, సిద్ధూకి అనుపమకి సెట్ లో గొడవ జరిగిందని… ఇలా రకరకాల వార్తలు వచ్చాయి.

అనుపమ అవుట్ అయిన తర్వాత మరో ఇద్దరు పేర్లు కూడా డీజే టిల్లు స్క్వేర్ హీరోయిన్స్ లిస్టులో వినిపించాయి. అవన్నీ నిజం కాదు కాస్ట్ రూమర్స్ మాత్రమే అనుపమ పరమేశ్వరన్ డీజే టిల్లు 2లో నటిస్తుందని రీసెంట్ గా అందరికీ ఒక క్లియర్ కట్ క్లారిటీ వచ్చేసింది. తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి అనుపమకి బర్త్ డే విషెస్ చెప్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో అనుపమని చూస్తే ఆడియన్స్ ‘రాధిక’ గుర్తొచ్చే ఛాన్స్ ఉంది. అనుపమ బర్త్ డేకి రిలీజ్ చేసినట్లే మేకర్స్, సిద్ధూ జొన్నలగడ్డ బర్త్ డేకి కూడా ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇంతకీ ఇవి కేవలం పుట్టిన రోజు అప్డేట్ గా బయటకి వస్తున్నాయా? లేక ఇవి ఫస్ట్ లుక్ పోస్టర్స్ గా రిలీజ్ అవుతున్నాయా అనేది మేకర్స్ కే తెలియాలి.