హీరోయిన్లు సాధారణంగానే మేకప్ వల్ల అందంగా కన్పిస్తారు. కానీ కొంతమంది మరింత అందంగా తయారవ్వడానికి మేకప్ మాత్రమే కాదు సర్జరీలను కూడా ఆశ్రయిస్తారు. అయితే అందులో కొంతమంది అంతం మెరుగుపడుతుంది. మరికొంత మందికి మాత్రం ఉన్న అందం చెడిపోతుంది. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు ఇలా తమ అందాన్ని పాడు చేసుకున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ ఆ జాబితాలో చేరిపోయింది అంటున్నారు. బార్బీ బొమ్మలా అందంగా ఉండే బాలీవుడ్ బ్యూటీ దిశా పటానిపై ట్రోలింగ్ జరుగుతోంది.
శుక్రవారం ముంబైలో జరిగిన సల్మాన్ ఖాన్ ‘యాంటిమ్’ సినిమా స్క్రీనింగ్‌లో దిషా పటానీ అద్భుతంగా కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. దిశా పసుపు రంగు క్రాప్ టాప్, డెనిమ్స్‌లో హాట్‌గా కనిపించింది. ఈ ఈవెంట్ లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మేరకు దిశా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే కొంతమంది ఆమె ఈ ఈవెంట్‌లో కనిపించిన తీరు అసాధారణంగా ఉందని అంటున్నారు.
Read Also : లేడీ వ్యాపారవేత్త వలలో టాలీవుడ్ హీరోలు… 200 కోట్ల కుచ్చు టోపీ
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దిశా ఫోటోలు, వీడియోలలో ఆమె చాలా భిన్నంగా కనిపిస్తోందని నెటిజన్లు చెప్పారు. దిశా తన రూపాన్ని మెరుగుపరచుకోవడానికి ముక్కు లేదా పెదవుల సర్జరీని చేయించుకోవచ్చని అభిప్రాయ పడుతున్నారు. ఈ ‘యాంటీమ్’ ఈవెంట్ దిశా తన ముఖానికి శస్త్రచికిత్స చేయించుకున్నట్టు పుకార్లకు దారి తీసింది. సర్జరీతో ముఖాన్ని నాశనం చేసుకున్న మరో హీరోయిన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సల్మాన్ ఖాన్ సరసన ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ చిత్రంలో ‘దియా’గా కనిపించింది. ప్రస్తుతం దిశా తదుపరి మూవీ ‘ఏక్ విలన్ రిటర్న్స్’లో కనిపించనుంది. చిత్రనిర్మాత మోహిత్ సూరి దర్శకత్వంలో జాన్ అబ్రహం, అర్జున్ కపూర్, తారా సుతారియాలతో కలిసి రాబోయే ‘ఏక్ విలన్ రిటర్న్స్ఈ నటిస్తోంది. ఈ చిత్రం 2014లో సిద్ధార్థ్ మల్హోత్రా, రితీష్ దేశ్‌ముఖ్, శ్రద్ధా కపూర్ నటించిన బ్లాక్ బస్టర్ ‘ఏక్ విలన్’కి సీక్వెల్.
