NTV Telugu Site icon

Dirty Picture 2: తెరపై మరోసారి సందడి చేయనున్న సిల్క్ స్మిత..?

Silk

Silk

Dirty Picture 2: టాలీవుడ్ హాట్ బ్యూటీ సిల్క్ స్మిత గురించి ఎవరికి గుర్తుచేసాయాల్సిన అవసరం లేదు. ఇప్పటికి ఆమె నటించిన ఐటెం సాంగ్స్ ఏదో ఒక పార్టీలో వినిపిస్తూనే ఉంటాయి. ఇక సిల్క్ స్మిత జీవితం గురించి కూడా అందరికి తెల్సిందే. ఆమె ఎలా చనిపోయింది..? ఎలా బతికింది ..? అనేది తెరిచినా పుస్తకం. ఇక ఆమె కథతో హిందీలో డర్టీ పిక్చర్ సినిమా తెరకెక్కిన విషయం తెల్సిందే. బాలీవుడ్ భామ విద్యా బలం ఇందులో సిల్క్ స్మిత గా నటించింది అనడం కంటే జీవించింది అని చెప్పాలి. మిలన్‌ లుత్రియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకొంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డర్టీ పిక్చర్ కు సీక్వెల్ రానున్నదట.

ఇప్పటికే దర్శకనిర్మాతలు ఈ విషయాన్ని ధృవీకరించారని, త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో మిస్ అయిన కథను.. రెండో భాగంలో డీటైల్డ్ గా చూపించనున్నారట. అయితే ఈసారి కూడా సిల్క్ గా విద్యానే కనిపిస్తుందా..? అనేది డౌట్ అని తెలుస్తోంది. ఇప్పటివరకు విద్యా వద్దకు ఎవరు వెళ్లలేదని, కొత్త హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నారని టాక్ నడుస్తోంది. మరి ఒకవేళ ఈ వార్త నిజమైతే కొత్త సిల్క్ గా ప్రేక్షకులను మెప్పించడానికి ఏ బ్యూటీ రంగంలోకి దిగుతుందో చూడాలి.

Show comments