Dirty Fellow to Release on may 24th: శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి హీరో హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో జి. యస్. బాబు నిర్మించిన చిత్రం “డర్టీ ఫెలో”. శ్రీమతి గుడూరు భద్ర కాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా మే 24న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశారు. చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తున్న దర్శకుడు మల్లిడి వశిష్ట ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో శాంతి చంద్ర చిత్ర దర్శకుడు మూర్తి సాయి అడారి, చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
Prasanna Vadanam: ఓటీటీలోకి థ్రిల్లర్ డ్రామా.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్!!
ఈ క్రమంలో మల్లిడి వశిష్ట మాట్లాడుతూ శాంతిచంద్ర హీరోగా నటించిన డర్టీఫెలో సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశా, మే 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. హీరో శాంతిచంద్ర మాట్లాడుతూ మా డర్టీ ఫెలో సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసి టీమ్ ని అభినందించిన మల్లిడి వశిష్ట గారికి ధన్యవాదాలు. మే 24న డర్టీ ఫెలో సినిమా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అవుతుంది, సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది అని అన్నారు. సత్యప్రకాష్, నాగినీడు, ఎఫ్ ఎమ్ బాబాయ్, కుమరన్, జయశ్రీ, సురేంద్ర తదితరులు నటించిన ఈ సినిమాకి రామకృష్ణ. యస్ డి. ఓ. పిగా, డాక్టర్. సతీష్ కుమార్.పి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు.
