Site icon NTV Telugu

Sandevela Song: సందెవేళ సాంగేసుకున్న “డర్టీ ఫెలో’’

Dirty Fellow Song

Dirty Fellow Song

Dirty Fellow Sandevela Song Released: శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి హీరో హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో జి. యస్. బాబు నిర్మించిన “డర్టీ ఫెలో” సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. గుడూరు భద్ర కాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ మీద ద్రుష్టి పెట్టింది. తాజాగా సినిమాలోని సందెవేళ పాటను ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, చిత్ర హీరో శాంతి చంద్ర మరియు సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Nara Lokesh: ‘కుర్చీ మడతపెట్టి’న నారా లోకేష్

ఇక ఈ సాంగ్ మధుర ఆడియో ద్వారా మార్కెట్లో రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలో దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ నా మిత్రుడు శాంతి చంద్ర నటించిన డర్టీ ఫెలో సినిమాలో సందెవేళ సాంగ్ చాలా బాగుంది, సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. హీరో శాంతిచంద్ర మాట్లాడుతూ మా డర్టీ ఫెలో సినిమాలోని సందెవేళ సాంగ్ ను దర్శకుడు సాయి రాజేష్ రిలీజ్ చేసి మా టీమ్ ని అభినందించారు, సాంగ్ సాయిరాజేష్ కి బాగా నచ్చిందని అన్నారు. ఇక ఈ సినిమాలో సత్యప్రకాష్, నాగినీడు, ఎఫ్ ఎమ్ బాబాయ్, కుమరన్, జయశ్రీ, సురేంద్ర తదితరులు ఇతర కీలక పాత్రలలో నటించారు.

Exit mobile version