Site icon NTV Telugu

Vivek Agnihotri: ఒకటి హిట్ ఇంకోటి డిజాస్టర్… ఇప్పుడు మహాభారతం పైన పడ్డాడు

Vivek Agnihotri

Vivek Agnihotri

చాకోలెట్, ధన్ ధనా ధన్ గోల్, హేట్ స్టోరీ, జిద్, బుద్ధా ఇన్ ట్రాఫిక్ జామ్, జూనియత్… ఏంటి ఏవేవో పేర్లు చెప్తున్నారు అనుకోకండి. ఇవి కాశ్మీర్ ఫైల్స్ ముందు వరకూ వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన సినిమాలు. బాలీవుడ్ ఆడియన్స్ కి కూడా పూర్తిగా తెలియని ఈ సినిమాల తర్వాత వివేక్ అగ్నిహోత్రి “ది తష్కెంట్ ఫైల్స్” సినిమా నుంచి ట్రాక్ మార్చాడు. ఈ సినిమా తర్వాత ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా చేసిన వివేక్ అగ్నిహోత్రి పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఒక సినిమా ఎంత వివాదాస్పదం అవ్వాలో అంతకన్నా ఎక్కువ అయ్యింది కాశ్మీర్ ఫైల్స్ సినిమాకి. ఈ సినిమా పేరుకే పాన్ ఇండియా హిట్ కానీ నార్త్ లో మాత్రమే ఆడియన్స్ కాశ్మీర్ ఫైల్స్ సినిమాని ఎక్కువగా చూసారు. సౌత్ లో ఆడియన్స్ కాశ్మీర్ ఫైల్స్ సినిమాని అంతగా ఆదరించలేదు. తెలుగు ఆడియన్స్ కూడా కాశ్మీర్ ఫైల్స్ ని అంతంతమాత్రంగానే చూసారు. ఈ సినిమాతో ఒక వర్గంలో క్రేజ్ ని సొంతం చేసుకున్న వివేక్ అగ్నిహోత్రి… వ్యాక్సిన్ పైన “ది వ్యాక్సిన్ వార్” అనే సినిమా చేసాడు.

కాశ్మీర్ ఫైల్స్ లాగే ఈ సినిమా కూడా హిట్ అవుతుంది అనుకోని పాన్ ఇండియా రేంజులో రిలీజ్ చేసారు కానీ వ్యాక్సిన్ వార్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యిందో ఎప్పుడు పోయిందో కూడా ఎవరికీ తెలియదు. సలార్ కి పోటీగా వస్తుంది అంటూ సెప్టెంబర్ 28న రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్నారు కాబట్టి ఆ మాత్రం అయినా జనాలకి వ్యాక్సిన్ వార్ సినిమా గురించి తెలుసు లేదంటే అది కూడా తెలిసేది కాదు. వ్యాక్సిన్ వార్ సినిమాతో డిజాస్టర్ సొంతం చేసుకున్న వివేక్ అగ్నిహోత్రి ఇప్పుడు మహాభారతం పైన పడ్డాడు. ఇది చరిత్రా లేక మైథాలజీనా అంటూ ట్వీట్ చేసిన వివేక్ అగ్నిహోత్రి మూడు భాగాలుగా మహాభారతం సినిమాని అనౌన్స్ చేసాడు. ఈ సినిమాలకి ‘పర్వ’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ‘పర్వ’ నవల ఆధారంగా ఈ సినిమాలు తెరకెక్కనున్నాయి. మరి వివేక్ అగ్నిహోత్రి ఈ మహాభారతం సినిమాలతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Exit mobile version