NTV Telugu Site icon

Venkatesh Maha: సార్ అనే ముందు కాస్త ఆలోచించాలి… ఊరికే అనేయకూడదు

Venkatesh Maha

Venkatesh Maha

రీసెంట్ గా ఫిల్మ్ మేకర్స్ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి కామన్ ఇంటర్వ్యూస్ చెయ్యడం కామన్ అయిపొయింది. అలాంటి ఒక ఇంటర్వ్యూలో నందినీ రెడ్డి, శివ నిర్వాణ,  ఇంద్రగంటి మోహన కృష్ణ, వెంకటేష్ మహా, వివేక్ ఆత్రేయలు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ రౌండ్ టేబుల్ గా జరిగిన ఈ ఇంటర్వ్యూ నిన్న యుట్యూబ్ లో రిలీజ్ అయ్యింది. సెన్సిబుల్ సినిమాలు చేసే దర్శకులు… తమ సినిమాల గురించి, తమ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతర దర్శకులు చేసిన సినిమాల గురించి ఏం మాట్లాడారు? అనే ఇంటరెస్ట్ తో వ్యూవర్స్ ఈ ఇంటర్వ్యూని ఓపెన్ చేశారు. గంటకి పైగా నిడివితో ఉన్న ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది, సినీ అభిమానుల నుంచి విమర్శలు ఫేస్ అయ్యేలా చేస్తోంది. ఇందుకు కారణం వెంకటేష్ మహా కమర్షియల్ సినిమాలపై చేసిన కామెంట్స్.

యాంకర్ అడిగిన ఒక ప్రశ్నకి సమాధానంగా… “ఇక్కడ ఇంటర్వ్యూలో ఉన్న అయిదు మంది దర్శకులతో పాటు, మంచి సినిమాలు చేసే ఇతర దర్శకులకి ఉన్న క్రెడిబిలిటీకి… మేము విలువలని పక్కన పెట్టి, పన్ను కాకుండా గన్ను పట్టుకుంటే బాబు లాంటి సినిమాలు చేస్తాం కానీ అలా చెయ్యలేకపోతున్నం. ఒక తల్లి కొడుకుని బాగుపడమని చెప్తుంది కానీ ప్రపంచంలో ఏ తల్లీ తన కొడుకుని బంగారం తీసుకోని రా, నీచ్ కామీన్ అవ్వు అని చెప్పదు. అలాంటిది ఒక కథతో సినిమా చేస్తే ఆడియన్స్ అంతా ఎగేసుకోని థియేటర్స్ కి వెళ్లి కోట్ల రూపాయలు ఇచ్చారు. అలాంటి సినిమాలు చూసే ఆడియన్స్ ప్రోగ్రెసివ్ మాటలు మాట్లాడకూడదు. నిజానికి ఆ చెత్త సినిమాలే ఒటీటీ సినిమాలు, మావి థియేటర్ లో చూడాల్సిన సినిమాలు” అంటూ ఆవేశంతో ఊగిపోయి ఇండైరెక్ట్ గా KGF సినిమాపై విమర్శలు చేశాడు. వెంకటేష్ మహా మాటలకి అక్కడ ఉన్న అందరూ చెప్పట్లు కొట్టారు, సోఫాలో పడి నవ్వారు కూడా. ఇంటర్వ్యూలో ఈ బిట్ చూసిన సినీ అభిమానులు… “మీరు ఎంత పెద్ద మేధావులు అయితే మంచి సినిమాలు చెయ్యండి, మీరు ఏం పొడిచారు. నువ్వు చేసిందే రెండు సినిమాలు అందులో ఒకటి రీమేక్, నువ్వు కూడా అనే వాడివే” అంటూ వెంకటేష్ మహాపై కామెంట్స్ చేస్తున్నారు.

కమర్షియల్ సినిమాలకి ఆర్ట్ సినిమాలకి ఒక తేడా ఉంటుంది. ఇండస్ట్రీని కమర్షియల్ సినిమాలే నడిపిస్తాయి, రెవిన్యూ జనరేట్ చేస్తాయి. KGF లాంటి సినిమాలో కథ చూసి జనాలు డబ్బులు ఇవ్వలేదు, రెండో సినిమాకే ఒక దర్శకుడు ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్ పైన చూడని ఎలివేషన్స్ ని చూపించాడు కాబట్టి డబ్బులు ఇచ్చారు. RRR సినిమాలో ఒక అద్భుతమైన కథ ఉందని ప్రపంచ సినీ అభిమానులు జేజేలు కొట్టడం లేదు. కథనం, మేకింగ్, మ్యూజిక్, పెర్ఫార్మెన్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా ఎన్నో ఎలిమెంట్స్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. కాంతార ఆర్ట్ సినిమానా లేక కమర్షియల్ సినిమానా అంటే ఎవరూ సమాధానం చెప్పలేరు. ఎందుకంటే ఆ మూవీ అడివి మనుషుల జీవితాన్ని చూపిస్తూనే భూత కోలలాంటి అర్ట్ ని కూడా కమర్షియల్ గా ప్రెజెంట్ చేసింది. రంగస్థలం, పుష్ప, విక్రమ్, పఠాన్ లాంటి సినిమాలు అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించాయి కాబట్టే అవి కమర్షియల్ సినిమలయ్యాయి. అంతే కానీ ఏ ఒక్క వర్గాన్నో టార్గెట్ చేసి తెరకెక్కించిన సినిమాలు కావు అవి. మన సినిమాల వరకే ఎందుకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తీసుకున్నా కూడా జేమ్స్ కమరూన్ తీసిన అవతార్ సినిమా 2 బిలియన్ డాలర్స్ ని రాబట్టింది, అందులో అద్భుతమైన కథ లేదు. కథ ఉండి, అద్భుతమైన మేకింగ్ ఉంది. థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ ని కట్టి పడేసే విజువల్స్ ఉన్నాయి. ఇలా డబ్బులు తెచ్చే ఏ సినిమాలో కూడా అద్భుతమైన కథ ఉండదు. మంచి కథకి, సాలిడ్ మేకింగ్ తోడవుతుంది అంతే.

ఈరోజు మన దగ్గర రైటర్ పద్మభూషణం లాంటి సినిమా పది కోట్లు కలెక్ట్ చేసింది, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా బ్లాస్ బస్టర్ అయ్యింది, బ్రోచేవారెవరు సినిమా థియేటర్స్ కి ఆడియన్స్ ని రప్పించింది, ఘాజీలాంటి మూవీ నేషనల్ అవార్డ్స్ తో పాటు డబ్బులని కూడా తెచ్చింది, నిన్ను కోరి సినిమాని యూత్ మాత్రమే ప్రతి ఫ్యామిలీ వెళ్లి చూసింది, అలా మొదలయ్యింది మూవీకి ఈరోజుకీ రిపీట్ ఆడియన్స్ ఉంటారు. అలా ఆర్ట్ సినిమానా? లేక కమర్శియల్ సినిమానా అనేది ఎప్పుడూ మ్యాటర్ కాదు. ఆడియన్స్ ని కన్వీన్స్ చేసేలా సినిమా చేస్తున్నామా? ఆడియన్స్ ని మెప్పించేలా సినిమా చేస్తున్నామా? అనేది ముఖ్యం. అది ఏ జోనర్ లో అయినా సరే ఆడియన్స్ ని మెప్పించడమే దర్శకుడి ప్రధాన లక్షణం. సింపుల్ గా చెప్పాలి అంటే సినిమా ఈజ్ ఆల్ అబౌట్ మనీ… నాకు డబ్బులు వచ్చే కథ చెప్పు, నేను డబ్బులు పెడతాను అని ప్రొడ్యూసర్ అంటాడు. నేను డబ్బులు పెట్టి సినిమాకి వచ్చాను, నన్ను సంతోష పరిచి థియేటర్ నుంచి బయటకి పంపించు అని ఆడియన్స్ అంటారు. ఇది రెగ్యులర్ గా జరిగే ఒక సర్క్యులర్ స్ట్రక్చర్. మంచి సినిమా చేస్తే అవార్డ్ వస్తుంది కానీ డబ్బులు రావు, డబ్బులు ఉంటేనే ఇంకో సినిమా చెయ్యడానికి వీలవుతుంది కానీ అవార్డ్ తో ఇంకో సినిమా చెయ్యలేరు. ఇది అర్ధం చేసుకోని వెంకటేష్ మహా మాట్లాడి ఉంటే బాగుండేది అని విమర్శలు వస్తున్నాయి.

మంచి కథలు రాస్తుంటే ప్రొడ్యూసర్స్ దొరకట్లేదు అని చెప్పడంలో అర్ధం ఉంది కానీ ఇలా ఇతర దర్శకుల పై, వాళ్లు చేసిన సినిమాల పైన విమర్శలు చెయ్యడం, అది వినీ నవ్వడం, ఆ సినిమాలని ఆదరించే ఆడియన్స్ ని కించపరచడమే. ఈ విషయం అర్ధం అయ్యింది కాబట్టే నందినీ రెడ్డి క్షమాపణలు చెప్తూ ట్వీట్ చేసింది. మరి ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇతర దర్శకులు, కామెంట్స్ చేసిన వెంకటేష్ మహా ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. ఇప్పటికైతే ఆ ఇంటర్వ్యూని చూసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.

Show comments