NTV Telugu Site icon

Kalki 2898 AD: ‘కల్కి’ రివ్యూ ఇచ్చిన లెక్కల మాస్టరు.. అసలు అదే హైలైట్ అంటూ!

As

As

Director Sukumar Reviewed Kalki 2898 AD: ఈ ఏడాది యావత్‌ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన సినిమాల్లో కల్కి ‘2898 ఏడీ’. రెబెల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా మహానటి ఫేమ్ నాగ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో క‌మ‌ల్‌హాస‌న్‌, అమితాబ్‌బ‌చ్చ‌న్‌, దీపికా పదుకొణె లాంటి స్టార్స్‌ కీలక పాత్రలు పోషించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్లు సినిమాపై ఎంతో హైప్‌ క్రియేట్‌ చేశాయి. భారీ అంచనాల మధ్య నిన్న(జూన్‌ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టుగా దూసుకుపోతుంది.

Also Read:Kalki 2898 AD: మొదటి రోజు కల్కి ఎన్ని వందల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

వెండితెరపై ప్రయోగాలు చేయడం అందరికీ సాధ్యం కాదు. కొద్ది మంది దర్శకులు మాత్రమే వైవిధ్యభరిత కథలను తెరకెక్కిస్తుంటారు. అది విజయం సాధించిందా? లేదా? అనేది పక్కన పెడితే.. ఆ ప్రయోగం మాత్రం చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంది. ‘కల్కి 2898’తో అలాంటి ప్రయోగమే చేశాడు డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌. ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడనటువంటి ప్రపంచాన్ని సృష్టించాడు. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్‌ జోడించి సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. హాలీవుడ్‌ మార్వెల్‌ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. విజువల్స్‌, గ్రాఫిక్స్‌ పరంగా అద్భుతమనే చెప్పాలి.

Also Read;Satyabhama : ఓటీటీలోకి వచ్చేసిన కాజల్ సత్యభామ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

ఇక ఈ సినిమా చుసిన స్టార్ డైరెక్టర్స్, హీరోలు అందరూ తమ తమ రీతిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కల్కి 2898 ఏడీ గురించి అద్భుతమైన రిపోర్టులు వినిపిస్తున్నాయి. ఈ ఘనత సాధించిన మొత్తం టీమ్ కు నా శుభాకాంక్షలు. ఇలా కలలు కంటూనే ఉండండి. ఇండియన్ సినిమా పతాకాన్ని మరింత పైకి ఎగరేస్తూనే ఉండండి” అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేయగా ఇప్పుడు అలానే స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాపైన ప్రశంశలు కురిపించారు. అసలు ఒక డైరెక్టర్ ఇలా సినిమా తియ్యడం అసాద్యమని అదికూడా ప్రతి క్యారెక్టర్ ఇంత అందగా చూపించడం కేవలం నాగ్ అశ్విన్ వల్లే సాధ్యం అవుతుంది అని ఇంతటి ఘనత సాధించిన కల్కి టీంకు న అభినందనలు అని చెప్పుకొచ్చారు.