NTV Telugu Site icon

OG: లొకేషన్స్ వేటలో #OG టీమ్… షూటింగ్ అప్పటినుంచేనా?

Og

Og

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. హరీష్ శంకర్, క్రిష్ లాంటి టాలెంటెడ్ దర్శకులతో పవన్ సినిమాలు చేస్తున్నాడు. కమర్షియల్ సినిమాల నుంచి పీరియాడిక్ డ్రామాల వరకూ అన్ని జానర్స్ లో సినిమాలని పవన్ చేస్తున్నా అతని అభిమానుల దృష్టి అంతా ఒక్క సినిమా పైనే ఉంది. ఆ ఒక్క ప్రాజెక్ట్ పైన అభిమానులు భారి అంచనాలు పెట్టుకున్నారు. ముహూర్తం మాత్రమే జరుపుకున్న ఆ మూవీ ‘OG’. సాహో సినిమాని తెరకెక్కించిన సుజీత్ దర్శత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ తోనే భారి అంచనాలు ఏర్పడ్డాయి. పంజా వైబ్స్ ఇస్తున్న OG సినిమా షూటింగ్ కోసం సెట్స్ పైకి వెళ్తుందా అని పవన్ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇందుకు కారణం సుజీత్, పవన్ కళ్యాణ్ ని డై హార్డ్ ఫ్యాన్ కావడమే. ఒక అభిమాని తన ఫేవరేట్ హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే హరీష్ శంకర్, కార్తీక్ సుబ్బరాజ్ లు చూపించారు. ఇప్పుడు సుజీత్ కూడా పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఏ రేంజులో చూడాలి అని కోరుకుంటున్నారో అంతకు మించి చూపించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం సుజీత్ OG సినిమా కోసం లొకేషన్స్ ని వెతికే పనిలో ఉన్నాడు. అర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్, డీఓపీ రవి చంద్రన్, సుజీత్ లు ముంబైలోని ‘ఫ్లోరా ఫౌంటైన్’ ప్రాంతంలో లొకేషన్స్ చూస్తున్నారు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందనున్న OG సినిమా మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కోసం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ‘పేట’ సినిమాలో కలకత్తా బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, సూపర్ స్టార్ రజినీకాంత్ ని చూపించిన రేంజులో, సుజిత్ పవన్ కళ్యాణ్ ని ముంబై బ్యాక్ డ్రాప్ లో చూపిస్తే చాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురవడం గ్యారెంటీ.