Director Shankar మరో దిగ్గజ దర్శకుడు రాజమౌళిపై సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. RRR మార్చ్ 25 నుంచి థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలోకి రావడంతో పండగ వాతావరణం నెలకొంది. అటు రామ్ చరణ్, ఇటు ఎన్టీఆర్ అభిమానులు సినిమాల హాళ్ల వద్ద చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇక జక్కన్న విజన్ కు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మరోవైపు సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా రాజమౌళికి ఆకాశానికెత్తేస్తున్నారు. అందులో భాగంగానే విజనరీ డైరెక్టర్ శంకర్ రాజమౌళి ‘మహారాజ’అంటూ మనస్ఫూర్తిగా అభినందించారు.
Read Also : Macherla Niyojakavargam : కలెక్టర్ సాబ్ వచ్చేసాడు… ఫస్ట్ లుక్ అవుట్
“రావిషింగ్, రివెటింగ్, రోబస్ట్. రోర్ అన్ని సమయాలలో ప్రతిధ్వనిస్తుంది. అసమానమైన అనుభవాన్ని అందించినందుకు మొత్తం టీమ్‌కి ధన్యవాదాలు. రామ్ చరణ్ ర్యాగింగ్ పెర్ఫార్మెన్స్ & స్క్రీన్ ప్రెజెన్స్… తారక్ రేడియంట్ భీమ్ మీ హృదయాన్ని ఆకర్షిస్తాడు. మీ ఊహ అజేయంగా ఉంటుంది… “మహారాజ”మౌళికి అభినందనలు” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా “ఆర్సీ15” అనే మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.
