NTV Telugu Site icon

Godfather : పూరీ మొదటి కలను నెరవేరుస్తున్న మెగాస్టార్

God Father

God Father

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మొదటి కలను నెరవేర్చే పనిలో పడ్డారు మెగాస్టార్. షూటింగ్ చివరి దశలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం “గాడ్ ఫాదర్”లో పూరీ జగన్నాధ్ అతిథి పాత్రలో కనిపిస్తారని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. “నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు, వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని హైదరాబాద్ వచ్చాడు. ఒకటి అరా వేషాలు వేశాడు. ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా.. అందుకే పూరి జగన్నాథ్ ను “గాడ్ ఫాదర్” సినిమాలో స్పెషల్ రోల్ లో పరిచయం చేయబోతున్నాను” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు పూరీని “గాడ్ ఫాదర్” సెట్లోకి ఆహ్వానిస్తున్న పిక్ ను షేర్ చేశారు. ఇక అక్కడే ఛార్మి కూడా ఉండడం గమనార్హం.

Read Also : Mannava Balayya : విషాదం… సీనియర్ నటుడి కన్నుమూత

ఈరోజు నుంచి “గాడ్ ఫాదర్” షూటింగ్ లో పాల్గొంటున్న పూరీ వారాంతంలోపు తన పార్ట్ షూటింగ్ పూర్తి చేస్తాడు. ఈ సినిమాలో పూరి అతిధి పాత్రలో కనిపించనున్నాడు. కానీ ప్రస్తుతానికి ఆయన ఎలాంటి పాత్ర పోషిస్తారు అన్న విషయంపై సస్పెన్స్ నెలకొంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ డ్రామా “గాడ్ ఫాదర్”. ఇందులో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు పూరి జగన్నాధ్ ‘లైగర్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో నిమగ్నమై ఉన్నాడు. త్వరలో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో ‘జనగణమన’ షూట్‌ను ప్రారంభించనున్నారు.