Site icon NTV Telugu

Tourist Family : ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రియురాలికి ప్రపోజ్ చేసిన దర్శకుడు

Tourist Family

Tourist Family

ప్రీ రిలిజ్ ఈవెంట్ అంటే సినిమాను ఆడియెన్స్ కు మరింత దగ్గర చేసే ఓ ఈవెంట్. సినిమాకు పని చేసిన యూనిట్ ను అభినందిచడం, తమకు సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు మీడియా ముఖంగా కృజ్ఞతలు తెలపడం వగైరా వైగారా వ్యవరాలు ఉంటాయి. అదంతా ఓ సరదాగా సాగే వ్యవహారం. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓ తమిళ దర్శకుడు చేసిన పని టాక్ అఫ్ ది టౌన్ గా మారింది.

Also Read : SAM : సమంత కావాలనే అలా చేస్తోందట.. లేడి డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

అసలింతకీ ఏమి జరిగిందంటే కోలీవుడ్ సీనియర్ నటుడు శశి కుమార్ హీరోగా టూరిస్ట్ ఫ్యామిలీ అనే సినిమాలో నటించారు. అభిషన్ జీవంత్ అనే యంగ్ డైరెక్టర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గడచిన శనివారం చెన్నైలోని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు యూనిట్ తో పాటు పలువురు సినిమా ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో దర్శకుడు అభిషన్ టూరిస్ట్ ఫ్యామిలీ ప్రీ రిలీజ్ వేదికపై నుండి తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రస్తుతం తన గర్ల్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుంటానని అందుకు ఆమె ఒప్పుకోవాలని ప్రపోజ్ చేసాడు. అదే ఈవెంట్ కు వచ్చిన అతగాడి ప్రేయసి మనోడి చేసిన పనికి ఆనందంలో కంటతడి పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన టూరిస్ట్ ఫ్యామిలీ మే 1 న రిలీజ్ కానుంది.

Exit mobile version