Site icon NTV Telugu

Hanuman: సంక్రాంతికి… అందరూ ‘జై హనుమాన్’ అనాల్సిందే

Hanuman

Hanuman

‘హనుమాన్’ ప్రస్తుతం టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్న సినిమా. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న హనుమాన్ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. తక్కువ బడ్జట్ లో, రిచ్ విజువల్స్ తో, హ్యూజ్ స్పాన్ ని సొంతం చేసుకుంది ‘హనుమాన్’ సినిమా. అనౌన్స్మెంట్ తోనే ఇండియన్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న హనుమాన్, ప్రమోషనల్ కంటెంట్ తో హైప్ పెరిగేలా చేసింది. యునానిమస్ గా ప్రతి ఒక్కరికి హనుమాన్ సినిమా సూపర్ హిట్ అవుతుంది, పాన్ ఇండియా రేంజులో సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది అనే నమ్మకం ఉంది. టీజర్ తో ఆ నమ్మకం మరింత పెరిగింది. దీంతో సినీ అభిమానులంతా హనుమాన్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ప్రశాంత్ వర్మ హనుమాన్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసాడు. ఈ సినిమా తెరకెక్కించడానికి రెండేళ్లు కష్టపడ్డాను, మరో ఆరు నెలల్లో ది బెస్ట్ సినిమా ఇస్తాను… 2024 జనవరి 12న హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుంది” అంటూ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేసాడు. హనుమాన్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ రావడంతో మూవీ లవర్స్ ఖుషి అవుతున్నారు.

సోషల్ మీడియాలో #HanuManForSankranthi టాగ్ ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉంటే హనుమాన్ అనౌన్స్ చేసిన డేట్ కే ప్రభాస్ ప్రాజెక్ట్ K రిలీజ్ అవ్వనుంది. గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ‘ప్రాజెక్ట్ K’ సంక్రాంతికి విడుదల అయ్యేలా కనిపించట్లేదు. ఈ విషయం తెలిసే హనుమాన్ సినిమాని రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ రెడీ అయినట్లు ఉన్నారు. ప్రాజెక్ట్ K రిలీజ్ కాకపోయినా మహేష్ బాబు-త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’, రవితేజ ఈగల్ సినిమాలు కూడా సంక్రాంతి బరిలోనే ఉన్నాయి. ఆన్ టైమ్ షూట్ కంప్లీట్ చేస్తే చిరు త్వరలో స్టార్ట్ చేయనున్న సినిమా కూడా సంక్రాంతి బరిలోనే నిలవాలని చూస్తుంది. మరి ఇన్ని సినిమాల మధ్యలో, ఏ మూవీ వెనక్కి తగ్గుతుంది. ఏ సినిమా చెప్పిన డేట్ కే విడుదల చేస్తుంది అనేది చూడాలి.

Exit mobile version