NTV Telugu Site icon

Mohan Raja: స్టోరీలో మెగాస్టార్ వేలు పెడతారని అన్నవాళ్లను కొట్టేస్తా..!!

Mohan Raja

Mohan Raja

Mohan Raja: హైదరాబాద్ నోవాటెల్‌లో శనివారం రాత్రి గాడ్ ఫాదర్ మూవీ సక్సెట్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు. అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదలైన గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ.. గాడ్ ఫాదర్ మూవీని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇండియన్ సినిమాకు ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు కీలకంగా మారారని.. మంచి సినిమా వస్తే తప్పకుండా ఆదరిస్తామని తెలుగు ఆడియన్స్ మరోసారి చాటిచెప్పారని మోహన్ రాజా కొనియాడాడు. తాను పుట్టింది, పెరిగింది తమిళనాడులో అయినా దర్శకుడిగా పుట్టింది మాత్రం ఆంధ్రాలోనే అని గర్వంగా చెప్పాడు.

తన తొలి సినిమాను తన తండ్రి ఎడిటర్ మోహన్ నిర్మించారని దర్శకుడు మోహన్ రాజా వెల్లడించాడు. తన తండ్రి తెలుగులో హిట్లర్, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, హనుమాన్ జంక్షన్ వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించినా తమ కోసం తమిళనాడుకు వచ్చి 20 ఏళ్లు ఉన్నారని గుర్తుచేసుకున్నాడు. గాడ్ ఫాదర్ సినిమా తీసే సమయంలో ప్రతిరోజూ తన తండ్రి ఫోన్ చేసి బాగోగులు అడిగేవారని మోహన్ రాజా ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమా టైంలో తనను ముగ్గురు బాగా చూసుకున్నారని.. వారిలో ఒకరు మెగాస్టార్, రెండో వారు నిర్మాత ఎన్వీ ప్రసాద్.. మూడో వ్యక్తి సత్యానంద్ అని తెలిపారు. కర్నూలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నిర్మాత ఎన్వీ ప్రసాద్ రూ.కోట్లు ఖర్చు పెట్టారని.. కానీ ఆ ఈవెంట్ రోజు వర్షం పడటంతో పలువురు బ్యాడ్ లక్ అని చెప్పే పరిస్థితి నెలకొందన్నారు. అయితే ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి తన ప్రసంగంతో ఈ సినిమాకు ఊపు తెచ్చారని తెలిపారు.

Read Also: Nuvve Nuvve: ఇప్పుడు త్రివిక్రమ్ మూవీ వంతు..!!

అటు స్టోరీలో మెగాస్టార్ వేలు పెడతారని అన్నవాళ్లను కొట్టేస్తానని మోహన్ రాజా వార్నింగ్ ఇచ్చాడు. ఆయన లాంటి ఎక్స్‌పీరియన్స్‌ను వాడుకోకపోతే తాము ఫూల్స్ అని అన్నారు. ప్రతి సీన్ కోసం చిరంజీవి ఇన్‌పుట్ ఇస్తారని.. ఆయన లాంటి సీనియర్ నటుడు ఉన్నప్పుడు ఆయన చెప్పే సలహాలు తీసుకోవడం తమ లాంటి వ్యక్తుల బాధ్యత అని అభిప్రాయపడ్డారు. మెగాస్టార్ వంటి నటులను శాటిస్‌ఫై చేయాలని.. అలా చేశాం కాబట్టే గాడ్ ఫాదర్ మూవీ ఈరోజు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని మోహన్ రాజా మాట్లాడాడు. గతంలో తన తండ్రి సినిమా విడుదలైతే తమకు థియేటర్లు ఇవ్వరా అని ఎగ్జిబిటర్లు అడిగేవారు అని.. అలాంటి స్థితిలో తెలుగులో సినిమాలను నిర్మించకుండా వదిలేసిన తమ తండ్రి ఎడిటర్ మోహన్ ఎంతో గొప్పవారు అని కొనియాడాడు.

Show comments