Site icon NTV Telugu

నిర్మాతగా మారిన ఇంద్రగంటి

Director Mohan Krishna Indraganti turns producer

‘గ్రహణం, అష్టాచెమ్మ, గోల్కొండ హైస్కూల్, అంతకుముందు ఆ తర్వాత, జెంటిల్ మేన్, సమ్మోహనం, వి’ వంటి విభిన్న తరహా సినిమాలు తీసిన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి. ప్రస్తుతం ‘ఆ అమ్మాయి గురించి మీకు తెలుసు’ సినిమాతో బిజీగా ఉన్నాడు మోహనకృష్ణ. అంతే కాదు నిర్మాతగానూ సినిమా నిర్మాణంలో అడుగుపెట్టబోతున్నారు. గ్రామీణ నేపథ్యంలో ఓ సినిమా తీయటానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాకు తాను దర్శకత్వం వహించటం లేదు. సంతోష్ కాటాను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. బెంచ్‌మార్క్ స్టూడియోస్‌తో కలయి జాయింట్ వెంచర్ గా సినిమా తీయబోతున్నాడు మోహనకృష్ణ.

Read Also : “రాజ రాజ చోర” ట్విట్టర్ రివ్యూ

ఈ సినిమా ద్వారా కొత్త టాలెంట్ ని పరిచయం చేయబోతున్నారు. ఇందులో నటించే వారి కోసం కాస్టింగ్ కాల్ కాల్ ఫర్ చేశారు. దర్శకుడు సంతోష్ కాట అద్భుతమైన కథ చెప్పాడని, ఆ కథను కొత్త వాళ్ళతో ఫీచర్ ఫిల్మ్‌గా తీయబోతున్నానని ఇంద్రగంటి అంటున్నారు. మేల్, ఫిమేల్ లీడ్స్ తో పాటు మధ్యవయసుకు చెందిన వ్యక్తి, మహిళ… అలాగే ముగ్గురు అబ్బాయిలు కావలసి వస్తారని, ఆసక్తి ఉన్న కళాకారులు సంప్రదించవచ్చని చెబుతున్నాడు ఇంద్రగంటి మోహనకృష్ణ. మరి ఆసక్తి ఉన్నవారు ఆయనను సంప్రదించవచ్చు

Exit mobile version