డైరెక్టర్ పూరి జగన్నాథ్ తర్వాత తెలుగులో హీరో క్యారెక్టరైజేషన్ పైన కథని, పవర్ ఫుల్ వన్ లైనర్ డైలాగ్స్ ని రాయగల ఏకైక దర్శకుడు హరీష్ శంకర్ మాత్రమే. హరీష్ శంకర్ ఒక హీరోకి లో యాంగిల్ షాట్ పెట్టి, ఒక వన్ లైనర్ డైలాగ్ వదిలితే చాలు థియేటర్స్ లో మాస్ ఆడియన్స్ విజిల్స్ వేయాల్సిందే. గబ్బర్ సింగ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్టార్ట్ చేసాడు హరీష్ శంకర్. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న పొలిటికల్ సినారియోని దృష్టిలో పెట్టుకోని ఇప్పట్లో ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పైకి వెళ్లేలా కనిపించట్లేదు. దీంతో ట్రాక్ మార్చిన హరీష్ శంకర్… నెక్స్ట్ ప్రాజెక్ట్ కి రెడీ అయిపోయాడు. షాక్, మిరపకాయ్ సినిమాలతో ఇప్పటికే రవితేజతో రెండు సినిమాలు చేసిన హరీష్ శంకర్… హ్యాట్రిక్ సినిమా కోసం రవితేజతో చేతులు కలిపాడు.
ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన హీరో లుక్ ఫోటోషూట్ చేసే పనిలో ఉన్నాడు హరీష్ శంకర్. ఫోటోషూట్ కంప్లీట్ అయిన తర్వాత మేకర్స్ నుంచి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకి రానుంది. హిందీలో అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాని మాస్ మహారాజ రవితేజతో హరీష్ శంకర్ రీమేక్ చేయబోతున్నాడని సమాచారం. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి హరీష్ శంకర్ కలిస్తే ఎలా ఉంటుందో మిరపకాయ్ సినిమాలో చూసేసారు కాకపోతే మిరపకాయ్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుంది కానీ రైడ్ సినిమా సీరియస్ డ్రామా. ఒక ఇన్కమ్ టాక్స్ రైడ్ గురించి జరిగే కథలో హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్ ని ఎలా ప్లేస్ చేస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ సెటప్ అనే చెప్పాలి. అయితే రైడ్ కోర్ సబ్జెక్ట్ సీరియస్ టోన్ లో ఉంటుంది కాబట్టి… సీరియస్ ఎమోషన్ ని రవితేజతో హరీష్ శంకర్ ఎంత వరకూ ఫుల్ ఆఫ్ చేస్తాడు అనేది చూడాలి.
