Dirty Fellow Pre Release Event: ఇండియన్ నేవీలో పని చేసిన సోల్జర్ శాంతి చంద్ర హీరోగా నటిస్తున్న ‘డర్టీ ఫెలో’ ఈ నెల 24న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. దీపిక సింగ్, సిమ్రితీ బతీజా, నిక్కిషా రంగ్ వాలా హీరోయిన్స్ గా కనిపించబోతున్న ఈ సినిమాను గుడూరు భద్రకాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శాంతి బాబు నిర్మిస్తున్నారు. ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్, హీరో సంపూర్ణేష్ బాబు గెస్ట్ లుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆడారి మూర్తి సాయి మాట్లాడుతూ ఒకప్పుడు మన సినిమాలకు శతదినోత్సవాలు జరుపుకునే వాళ్లం, ఇప్పుడు రెండు రోజులకే సినిమా లైఫ్ ఫినిష్ అవుతూ జత దినోత్సవం జరుపుకునే పరిస్థితి వచ్చింది. టీవీ వచ్చాక సినిమా పనైపోయింది అన్నారు.
Tollywood Heroes : హైయేస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న యంగ్ హీరోలు వీరే..
పైరసీ వచ్చాక ఇక సినిమా బతకలేదన్నారు. అయినా ఇండస్ట్రీ తట్టుకుని ముందడుగు వేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు పైరసీ కాదు ప్రైవసీ జబ్బు వచ్చింది. ఎవరికి వారు ఇంటినే హోమ్ థియేటర్ లా భావిస్తున్నారు. ఇంట్లో పూజ గది ఉంటే దేవాలయం కాదు. సినిమాను థియేటర్ లో చూడండి. చిన్న సినిమాలను బతికించండి. లేకుంటే ఒకప్పుడు తోలు బొమ్మలాటలు ఆడేవారంట అని చెప్పుకున్నట్లు థియేటర్ లో సినిమాలు ప్రదర్శించేవారంట అని రేపటి తరాలు చెప్పుకుంటాయన్నారు. హీరో శాంతి చంద్ర మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి నేను ఏం చేసినా కెమెరా నన్ను ఫాలో అవుతుందనే ఫీల్ అయ్యేవాడిని, ఇండియన్ నేవీలో చేరాక అక్కడ మేము చేసే సాహసాల టైమ్ లోనూ కెమెరా ఉందనే అనిపించేదన్నారు. ఎప్పటికైనా హీరో కావాలనే కలగన్నా, మంత్ర సినిమాతో ఆ కోరిక తీరింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో కొంత గ్యాప్ వచ్చిందన్నారు. బిజినెస్ చేస్తూ ఇక్కడ మూవీస్ చేయలేకపోయా కానీ ఇక్కడ స్థిరపడాలంటే ఇక్కడే ఉండాలన్నారు.
