Site icon NTV Telugu

NBK Boyapati: అఖండ 2కి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న ఊరమాస్ డైరెక్టర్?

Akhanda Movie

Akhanda Movie

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింహా, లెజెండ్, అఖండ సినిమాలతో మాస్ ర్యాంపేజ్ చూపించారు బాలయ్య, బోయపాటి. ముఖ్యంగా అఖండ సినిమా అఖండ విజయాన్ని అందుకుంది. తమన్ దెబ్బకు థియేటర్ బాక్సులు పగిలిపోయాయి. ఇక బాలయ్య ర్యాంపేజ్‌కు బాక్సాఫీస్ బద్దలైంది. దీంతో… అఖండ 2 కూడా ఉంటుందని అప్పుడే చెప్పేశాడు బోయపాటి కానీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అందుకే… ఈ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అని ఎదురు చూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. లేటెస్ట్ అప్డేట్ మాత్రం అఖండ2 లోడింగ్ అని చెబుతోంది. అఖండ తర్వాత రామ్‌తో స్కంద సినిమా తెరకెక్కించాడు బోయపాటి.

Read Also: Mahesh Babu: నెల్ రోజుల్లో రిలీజ్ ఉంది స్పీడ్ పెంచండి… అప్డేట్ కోసం సోషల్ మీడియాలో ట్రెండ్

బాక్సాఫీస్ దగ్గర స్కంద సినిమా మిక్స్డ్‌ రిజల్ట్ సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు బోయపాటి. తమిళ్ హీరో సూర్యతో ఉంటుందనే టాక్ ఉన్నప్పటికీ క్లారిటీ లేదు కానీ ప్రస్తుతం బోయపాటి శ్రీను ‘అఖండ 2’ స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు… వచ్చే ఏడాది ఆగస్టులో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాలయ్య… డైరెక్టర్ బాబీతో ఎన్బీకె 109 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా అయిపోగానే… ‘అఖండ 2’ ఉంటుందని అంటున్నారు. ఈసారి సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ అండ్ పొలిటికల్ పంచ్‌లు పీక్స్‌లో ఉంటాయట. మరి ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఎప్పుడుంటుందో చూడాలి.

Exit mobile version