NTV Telugu Site icon

Dimple Hayati: తప్పు ఒప్పు పక్కన పెడితే.. పాప.. ఒక్కసారిగా ఫేమస్ అయిందిగా

Dimple

Dimple

Dimple Hayati: సాధారణంగా చిత్ర పరిశ్రమ అనేకాదు.. ఏదైనా ఒక ఘటన జరిగి.. అది బాగా ఫేమస్ అయితే ఆ ఘటనలో ఉన్నవారు గురించే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. ఆ తరువాత అలాంటి ఘటన ఏది జరిగినా మొదట వీరినే తలచుకుంటారు. ఇక చిత్ర పరిశ్రమలో కూడా అంతే.. సినిమాల ద్వారా ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారు. వివాదాలు వలన ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం డస్కీ బ్యూటీ డింపుల్ హయతి కూడా ఒక వివాదం వలన సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యి కూర్చోంది. ఆ వివాదం ఏంటి అంటే.. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో ఆమె గొడవపెట్టుకుంది. ఐపీఎస్ అధికారి కారును ఉద్దేశపూర్వకంగా ఢీ కొట్టడంతో పాటు హంగామా చేసిందన్న ఆరోపణలతో ఆమె పై జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. ఇక ఈ వివాదం ఉన్నాకొద్దిగా ముదురుతోంది. ఈ కేసులో ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతున్నాయి. నేనేమి తప్పు చేయలేదని డింపుల్ అంటుంటే.. నేమి తప్పు లేదని రాహుల్ అంటున్నాడు. ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న డీసీపీ రాహుల్‌, డింపుల్‌. చలాన్లతో పాటు పార్కింగ్‌ విషయంలోనూ చాలాసార్లు గొడవపడినట్లు తెలుస్తోంది.

DCP Rahul Hegde: నేనెక్కడా తప్పు చేయలేదు.. డింపుల్ ప్రవర్తన అభ్యంతరకరం

ఇంకోపక్క “నేను, డింపుల్‌ ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాం.. నా కారుకు అడ్డంగా డింపుల్‌ కారు పెట్టారు.. నాకు అర్జెంట్‌గా బయటకు వెళ్లే పని ఏర్పడింది.. నేను వ్యక్తిగతంగా వెళ్లి కారు తీయాలని రిక్వెస్ట్‌ చేశాను. నా కారును ఢీకొట్టి, కాళ్లతో తన్నింది.. నా పట్ల డింపుల్‌ ప్రవర్తన తీవ్ర అభ్యంతరకరం.. నేను ఎక్కడా తప్పు చేయలేదు.. డింపుల్‌ చేసిన ట్వీట్‌ పూర్తిగా అభ్యంతరకరం” అని రాహుల్ చెప్పుకొచ్చాడు. ఇక దీనికి సమాధానంగా.. నా మీద తప్పుడు కేసు పెట్టారు.. నేను డీసీపీని ఎప్పుడూ ఇబ్బందిపెట్టలేదు.. పబ్లిక్‌ ప్రాపర్టీని తీసుకొచ్చి ప్రైవేట్‌ ప్రాపర్టీలో పెట్టారు. నా కారుతో డీసీపీ వాహనాన్ని ఢీకొట్టలేదు.. డీసీపీ కారుకు ఎక్కడైనా ప్రమాదం జరిగి ఉండొచ్చు.. నా కారుతో ఢీ కొడితే రెండు వైపుల డ్యామేజ్‌ ఉండాలి కదా? అని డింపుల్ ప్రశ్నిస్తోంది. ప్రస్తుతం ఈ వివాదం ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు ఇక ఇద్దరిలో తప్పు ఎవరిది అనేది పక్కన పెడితే.. ఈ ఒక్క వివాదంతో డింపుల్ బిగా ఫేమస్ అయ్యింది. ఇప్పటివరకు డింపుల్ తెలియని వారు కూడా ఆమె హీరోయిన్ అని తెలుసుకొని ఆమె నటించిన చిత్రాల కోసం సెర్చ్ చేస్తున్నారట.

BroTheAvatar: దేవుడి ఫ్రెండ్ మార్కండేయుడు వచ్చేశాడు..

ఇక డింపుల్ కెరీర్ విషయానికొస్తే.. గద్దలకొండ గణేష్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేసి తెలుగుతెరకు పరిచయమైంది. నిజం చెప్పాలంటే.. డింపుల్.. తెలుగు అమ్మాయి. కానీ, కోలీవుడ్ నుంచి రావడంతో అమ్మడిని కోలీవుడ్ నటి అనుకుంటున్నారు. ఇక రవితేజ సరసన ఖిలాడీ సినిమాలో నటించడంతో అమ్మడికి హిట్ పడుతుంది అనుకున్నారు. కానీ, నిరాశే మిగిలింది. ఇక ఈ మధ్యనే రామబాణం సినిమాలో గోపీచంద్ సరసన నటించింది. కనీసం ఇదైనా క్లిక్ అయితే.. ఒక హిట్ అందుకున్న హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొనేది. కానీ, ఇది కూడా బోల్తా కొట్టేసింది. ప్రస్తుతం అమ్మడు పలు ప్రాజెక్ట్స్ చేస్తుందని టాక్. మరి ఈ వివాదం వలన అమ్మడికి విజయం ఏమైనా దక్కుతుందా..? లేదా అనేది తెలియాలి.