Site icon NTV Telugu

Demonte Colony: హర్రర్ ఫ్యాన్స్ సిద్ధం కండి.. డిమాంటీ మళ్లీ వచ్చేస్తున్నాడు

Demonty

Demonty

Demonte Colony:హర్రర్ సినిమాలు అంటే ఎన్నో సినిమాలు గుర్తుకువస్తాయి. అందులో డిమాంటీ కాలనీ ఒకటి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అరుళ్ నిధి హీరోగా కనిపించాడు. ముగ్గురు స్నేహితులు ఒక ఇంట్లో స్పిరిట్ గేమ్ ఆది దెయ్యాన్ని పిలవడానికి ప్రయత్నిస్తారు. ఆ కాలనీకి అధిపతి అయిన డిమాంటీ దెయ్యంగా వచ్చి వారిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉండదా, ముగ్గురు స్నేహితులు తప్పించుకోవడానికి ప్రయత్నించడం.. చివరికి ఒక్కరు కూడా మిగలకుండా చనిపోవడం.. మధ్యలో హర్రర్.. ఒకానొక సమయంలో ఈ సినిమాకు ప్యాంట్ లు తడిచిపోయాయి అంటే అతిశయోక్తి కాదు.

ముఖ్యంగా నేపధ్య సంగీతం అయితే వీర లెవెల్ అని చెప్పొచ్చు. అప్పట్లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోకపోయినా హర్రర్ ప్రేక్షకులను అయితే బాగానే మెప్పించింది. ఇక ఇన్నాళ్లకు ఈ సినిమా పార్ట్ 2 ను ప్రకటించాడు అజయ్. తాను తీసిన హర్రర్ మూవీ డిమోంటీ కాలనీ కి ప్రస్తుతం డిమోంటీ కాలనీ 2. వెంజెన్స్ ఆఫ్ ది అన్ హోలీ అనే టైటిల్ తో సీక్వెల్ తీస్తున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం షూటింగ్ మొదలైందని, ఈ మూవీలో కూడా అరుళ్ నిధి ప్రధాన పాత్ర చేస్తున్నట్లు తెలిపారు. మరి ఈ సీక్వెల్ ప్రేక్షకులకు ఎలాంటి హర్రర్ ఫీల్ ను కలిగిస్తుందో చూడాలి.

Exit mobile version