Site icon NTV Telugu

Dil Raju Productions: బలగం తర్వాత కొరియోగ్రాఫర్ ను ‘హీరో’ చేస్తున్న దిల్ రాజు

Yash Master As Hero

Yash Master As Hero

Dil raju Productions new movie with Yash master: దిల్ సినిమాతో నిర్మాతగా మారి పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు వెంకట రమణారెడ్డి. మొదటి సినిమానే ఇంటి పేరుగా మార్చుకుని దిల్ రాజు అయిన ఆయన ఇప్పుడు టాలీవుడ్ లో లీడింగ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. అయితే ఈ మధ్యనే తన సొంత వెంకటేశ్వర క్రియేషన్స్ తో పాటు దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి దాని బాద్యతలు తన కుమార్తె హన్షిత రెడ్డికి అప్పగించారు. ఆమె నిర్మాతగా కమెడియన్ వేణు డైరెక్టర్ గా తెరకెక్కించిన బలగం సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాదు పదుల సంఖ్యలో విదేశీ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. ఇక అలాంటి ప్రొడక్షన్ నుంచి రెండో సినిమా ఏం వస్తుందా? అని అందరూ ఎదురుచూస్తున్న క్రమంలో ఒక ఆసక్తికర అంశం అయితే టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Baby Collections: బేబీ మూవీ అనూహ్యమైన రికార్డు

అదేమంటే ఈ ప్రొడక్షన్ లో రెండో సినిమా ఇప్పటికే ఫిక్స్ అయిందని ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ ను హీరోని చేస్తున్నారని ప్రచారం జరగగా దాన్నే నిజం చేశారు. తెలుగులో కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న యష్ మాస్టర్ ఈ సినిమాతో హీరో అవుతున్నాడు. ఇక ఆయన సరసన హీరోయిన్ గా మలయాళ హీరోయిన్ ‘కార్తిక మురళీధరన్’నటిస్తుంది. డీఓపీ మురళీధరన్ డాటర్ అయిన కార్తిక మురళీధరన్ ఇప్పటికే మలయాళంలో సినిమాలు చేస్తూ ఉంది. ఇక ఈ సినిమాను శశి కుమార్ ఎం డైరెక్ట్ చేయబోతున్నారు. ఆకాశం దాటి వస్తావా అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Exit mobile version