Dil Raju Photoshoot With Vygha Reddy goes Viral in Social Media: ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎవరంటే దిల్ రాజు అనే వాళ్ళు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్న చాలా సినిమాలు బోల్తా పడుతున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతానికి ఆయన తన భార్య వైఘారెడ్డితో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.
నిజానికి దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశీష్ రెడ్డి హీరోగా నటించిన లవ్ మీ సినిమా రిలీజ్ సమయంలోనే దిల్ రాజు తన భార్యతో కలిసి విదేశాలకు వెకేషన్ కి వెళ్లారు. అయితే అప్పటి ఫోటోలు ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
దిల్ రాజు డెనిమ్ షాట్, డెనిమ్ జాకెట్ ధరించి కనిపిస్తూ ఉండగా వైఘారెడ్డి వైట్ కలర్ డ్రెస్ లో కనిపిస్తున్నారు. ఇక వీరిద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వగా అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కొన్ని ఫోటోలలో దిల్ రాజు ఫోన్ మాట్లాడుతుండగా కొన్ని ఫోటోలలో మాత్రం ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
దీంతో అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. గుండెల్లో ఏముందో, కళ్ళల్లో తెలుస్తుంది అంటూ పాటల లిరిక్స్ తో కామెంట్స్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి దిల్ రాజు, ఆయన భార్యకు సంబంధించిన ఫోటోలు అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.
Dil Raju: గుండెల్లో, ఏముందో…కళ్ళల్లో తెలుస్తుంది.. భార్యతో దిల్ మామ ఫొటోషూట్ వైరల్
- భార్య వైఘారెడ్డితో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న దిల్ రాజు
- తన భార్యతో కలిసి విదేశాలకు వెకేషన్ వెళ్లిన దిల్ రాజు
- సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఫొటోలు