Site icon NTV Telugu

Dil Raju: తమ్ముడి కొడుకు సంగీత్.. హలమితి హబీబో స్టెప్పులేసిన దిల్ రాజు

Dil Raju Dancing

Dil Raju Dancing

Dil Raju Dance at Asish Reddy Sangeeth Goes Viral: టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు సోదరుడు అయిన శిరీష్ తనయుడు ఆశిష్ వివాహం అద్వైత రెడ్డితో తాజాగా జైపూర్ లోని ప్యాలెస్ లో వైభవంగా జరిగిందన్న సంగతి తెలిసిందే. సరిగ్గా వాలెంటైన్స్ డే రోజున డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరిగిన ఈ వివాహ వేడుకలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరు అయ్యారు. ఇక ఈ పెళ్లిలో దిల్ రాజు చేసిన సందడి అంతా ఇంతా కాదు. తన తమ్ముడి కొడుకు అయినా కూడా ఆశిష్ ని తన వారసుడిగానే ఇండస్ట్రీకి దిల్‌ రాజు పరిచయం చేసి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యారు. ఆశిష్ పెళ్లి ఆహ్వాన పత్రికలు ఇవ్వడం మొదలుకుని దాదాపు అన్ని విషయాల్లో దిల్ రాజు ముందు ఉండి నడిపించే ప్రయత్నం చేశారు.

Rahul Gandhi: అయోధ్యలో ఒక్క దళితుడైనా కనిపించారా?.. రాహుల్ విమర్శలు

ఇక పెళ్లిలో కూడా స్పెషల్ గా కనిపించే విధంగా డ్రెస్ వేసుకోవడంతో పాటు మెడలో డప్పు వేసుకుని కొడుతూ డాన్స్ చేయడంతో పాటు, తన మనుమరాలితో కూడా దిల్‌ రాజు చేసిన సందడి బాగా వైరల్ అయింది. ఇక దిల్ రాజు డాన్స్ వీడియోలు మరియు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా సంగీత్ జరుగగా ఆ సంగీత్ లో కూడా హలమితీ హబీబీ సాంగ్ కి డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. ఆశిష్ తెలుగులో హీరోగా పరిచయం అయ్యాడు. రౌడీ బాయ్స్ తో టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ ఇప్పుడు రెండో సినిమాగా సెల్ఫిష్ అనే సినిమా చేస్తున్నాడు.

Exit mobile version