Site icon NTV Telugu

‘ఏటీఎం’ కోసం దిల్ రాజు, హరీష్ శంకర్ ప్లాన్… దొంగతనం పక్కా

ATM

కొన్ని రోజుల క్రితం ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్ ZEE5 దోపిడీ ఆధారిత తెలుగు వెబ్ సిరీస్ ను ప్రకటించింది. అయితే ఈ ఓటిటి తదుపరి వివరాలను మాత్రం ప్రకటించకుండా సస్పెన్స్ లో పెట్టేసింది. ఇప్పుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కలిసి హీస్ట్ సిరీస్‌ను నిర్మించబోతున్నారు. ఈ సిరీస్‌తో వీరిద్దరూ ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్‌కు కథను కూడా హరీష్ శంకర్ అందించాడు. ATM పేరుతో తెలుగు సిరీస్‌ని చంద్ర మోహన్ దర్శకత్వం వహించనున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రధాన నటీనటులు, ఇతర సిబ్బంది వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌కి చంద్రమోహన్ దర్శకత్వం వహించనున్నారు. ‘ఎటిఎమ్‌’ని దోచుకోవడానికి ప్లాన్ చేసే యువకుల గుంపు గురించిన కథాంశం అంతా.

Read Also : వివాదంలో మెగా కోడలు… సోషల్ మీడియా పోస్ట్ తో చిక్కులు

Exit mobile version