తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన యువ నటి, బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ఫేమ్ దీక్షా పంత్, ఇటీవల తన కెరీర్, బిగ్ బాస్ అనుభవాలు, ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ సమస్యలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Also Read : Balapur Ganesh : బాలాపూర్ గణేశుడిని దర్శించుకున్న తెలుగు హీరో..
‘వరుడు’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దీక్షా పంత్, తర్వాత రచ్చ, ఒక లైలా, గోపాలా గోపాలా, శంకరాభరణం, సోగ్గాడే చిన్ని నాయన, బంతిపూల జానకి, ఈగో వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఫేమ్ కారణంగా ఆమెకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో చోటు దక్కింది. బిగ్ బాస్ హౌస్‌లో తన అందం, మైండ్ గేమ్ ద్వారా అద్భుత ప్రదర్శన చేసింది దీక్షా. కానీ బబిగ్ బాస్ తర్వాత 8 సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్న దీక్షా, చివరిసారిగా ఈగో లో నటించారు. ఆమె ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, సినిమాలు కాకుండా మోడలింగ్ వైపు దృష్టి పెట్టారని తెలిపారు. అలాగే క్యాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంటర్వ్యూలో ఒక యాంకర్, “సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌లు అవకాశాల కోసం స్త్రీలకు ఒత్తిడి చేస్తారా?” అని ప్రశ్నించగా, దీక్షా స్పందిస్తూ..
‘ఇక్కడ ఇద్దరికీ ఇష్టం ఉంటే.. మధ్య వరుసలో ఉన్నవారికి వచ్చిన సమస్య ఏమిటి? నేను అయితే ఇంతవరకు ఇలాంటి ప్రాబ్లమ్‌ను ఎదుర్కోలేదు. పర్సనల్‌గా హ్యాండ్ ఇన్ హ్యాండ్ విధానంకు ఒప్పుకోను. మొదట్లో అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు వేరుగా ప్రవర్తించేవారు. నేను నో చెప్పిన వెంటనే రిజెక్ట్ చేసేవారు. అలా అవకాశాల కోసం అందరితో క్లోజ్‌గా ఉండలేను. అందుకే నటిగా పూర్తి సక్సెస్ కాలేకపోయాను’ అని తెలిపింది. ప్రజంట్ దీక్షా పంత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
