Rishab Shetty : రిషబ్ శెట్టిని ఆ నిర్మాణ సంస్థ మోసం చేసిందా?

Rishab Hombale

Rishab Hombale

కన్నడ పాన్ ఇండియా హీరోలు యశ్, రిషబ్ శెట్టిలతో పేచీలు పెట్టుకుంటూ డిస్కర్షన్‌లో నిలుస్తోంది ప్రొడక్షన్ హౌస్ హోంబలే. కేజీఎఫ్, కాంతారలతో ఈ స్టార్స్‌కు ఓ భారీ ఐడెంటిటీని ఇచ్చి, మార్కెట్ ఏర్పాటు చేసిన సంస్థ వారితోనే కొర్రీలు పెట్టుకొని దూరమైతోంది. దీంతో ఎవరి దారి వాళ్లే చూసుకుంటున్నారు. కేజీఫ్ సిరీస్ చిత్రాల తర్వాత హోంబలేకు దూరమైన యశ్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ఏర్పాటు చేసి.. టాక్సిక్ అండ్ రామాయణకు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

యశ్ మాత్రమే కాదు కాంతార హీరో రిషబ్ శెట్టి కూడా హోంబలేతో కటీఫ్ చెప్పేశాడు. గతంలో ఇన్ స్టాలో హోంబలేని అన్ ఫాలో చేసి హింట్ ఇచ్చాడు కన్నడ హీరో. అలాగే తను హీరోగా కమ్ దర్శకుడిగా వ్యహరించిన కాంతార అకౌంట్‌ని కూడా అన్ ఫాలో చేయడం చర్చకు దారి తీసింది. కాంతార చాప్టర్ వన్ తర్వాత అదే నిర్మాణ సంస్థలో చాప్టర్ 2 తీయాల్సిన టైంలో రిషబ్ చర్యలు హోంబలేకు, హీరోకు మధ్య పొసగడం లేదన్న వార్తలు ఊపందుకున్నాయి. వాటిని నిజం చేస్తూ తాజాగా రిషబ్ బర్తేడే సందర్భంగా విషెస్ చేయలేదు నిర్మాణ సంస్థ. దీంతో వీరి మధ్య సైలెంట్ వార్ జరుగుతుందన్న స్ట్రాంగ్ గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. కాంతార చాఫ్టర్ వన్ విషయంలో రిషబ్ అండ్ హోంబలేకు మధ్య ప్రాఫిట్ షేరింగ్ విషయంలో తేడా కొట్టిందని బజ్. అగ్రిమెంట్ ప్రకారం అతడికి చెల్లించాల్సిన అమౌంట్ ఇవ్వలేదని సమాచారం. కేజీఎఫ్2 విషయంలోనూ ఇదే జరిగి ఉంటుదని డిసైడ్ అవుతున్నారు శాండిల్ వుడ్ సినీ ఫ్యాన్స్. ప్రభాస్, హృతిక్ లాంటి స్టార్స్‌తో కొలాబరేషన్ కంటిన్యూ అవుతోన్న వేళ.. సొంత గూటిలో కుంపటి రాజేసుకుంది హోంబలే. ఇక కాంతార చాప్టర్2ని తన సొంత నిర్మాణ సంస్థ రిషబ్ శెట్టి ఫిల్మ్స్‌లో తెరకెక్కించబోతున్నాడు. స్టోరీని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించాడు రిషబ్.