ప్రస్తుతం సినీ ప్రియుల్లో ‘ధురందర్ 2’పై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాత్రలు నిజ జీవిత వ్యక్తుల ఆధారంగా రూపొందాయా? అనే సందేహం వ్యక్తమవుతోంది. రణవీర్ సింగ్ పోషించిన హమ్జా అలీ మజారీ పాత్ర వెనుక కొందరు అజ్ఞాత గూఢచారుల స్ఫూర్తి ఉందనే ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు అందరి దృష్టి సారా అర్జున్ నటించిన ‘యలీనా జమాలీ’ పాత్రపై పడింది. ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, యలీనా జమాలీ పాత్ర పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ పాకిస్థానీ రాజకీయ నాయకుడు నబిల్ గబోల్ కుమార్తె అయిన మహీన్ గబోల్ జీవితం నుండి ప్రేరణ పొంది ఉండవచ్చని మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మహీన్, తన తండ్రికి భిన్నంగా రాజకీయాలకు, ప్రచారానికి దూరంగా ఉండటానికే మొగ్గు చూపారు. సినిమాలో రాకేష్ బేడీ పోషించిన ‘జమీల్ జమాలీ’ పాత్ర కూడా నబిల్ గబోల్ జీవిత ఛాయలతో రూపొందించినట్లు మొదటి భాగం రిలీజ్ అయినట్టు ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. అయితే గబోల్ కుటుంబం తమ వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ రహస్యంగా ఉంచినప్పటికీ, గతంలో కొన్ని వివాదాస్పద కథనాలు వారి చుట్టూ ముసురుకున్నాయి.
Also Read:Dhurandhar 2: క్లైమాక్స్ సీన్లు లీక్ చేస్తే ఊరుకోం: నటుడు వార్నింగ్!
సినిమా కథ ప్రకారం.. రెహ్మాన్ గ్యాంగ్‌లో అండర్ కవర్ ఏజెంట్‌గా పనిచేసే హమ్జా, డాక్టరవ్వాలనుకునే యలీనా ప్రేమలో పడతాడు. రెండో భాగంలో వీరి బంధం మరింత బలపడటం, వారికి ఒక సంతానం కలగడం వంటి అంశాలు ఉన్నాయి. నిజ జీవిత విషయానికి వస్తే.. మహీన్ గబోల్ ఉజైర్ బలూచ్ గ్యాంగ్ మెంబర్ ఒకరితో ప్రేమలో పడింది, ఈ విషయం తెలిసి ఆమెను కుటుంబం కువైట్ కి పంపేసింది. ఆ తరువాత ఆమె 2025 డిసెంబర్‌లో పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ మాజీ స్పీకర్ ఇలాహీ బక్స్ సోమ్రో మనవడు మౌలా బక్స్ సోమ్రోను వివాహం చేసుకున్నారు. మౌలా బక్స్ ప్రస్తుతం సింధ్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ‘పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్’ పార్టీతో సంబంధం కలిగి ఉన్నట్లు సమాచారం. ఇక మొదటి భాగం వచ్చాక జమాల్ జామాలీ పాత్ర తన నిజ జీవితం నుంచే ఇన్స్పైర్ అయి రాసుకున్నారు అని చెప్పని గబోల్ ఇప్పుడు సెకండ్ పార్ట్ క్లైమాక్స్ చూసి వణికి పోతున్నాడు, ఇప్పుడు ఆ సినిమా పాత్ర కూతురు పాత్రకు తన కూతురికి కూడా కొంత సారూప్యత ఉండడం ఆయనని మరింత వణికిస్తోంది అని సన్నిహితులు చెబుతున్నారు.
