Site icon NTV Telugu

Dhurandhar 2: బాక్సాఫీస్ విధ్వంసం.. 1,680 కోట్లతో ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త మైలురాయి!

The Dhurandhar

The Dhurandhar

భారతీయ బాక్సాఫీస్ వద్ద ‘దురందర్: ది రివెంజ్’ ప్రభంజనం ఆగేలా కనిపించడం లేదు, జియో స్టూడియోస్ & బి62 స్టూడియోస్ నిర్మాణంలో, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎపిక్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. మూడవ వారం ముగిసే సమయానికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్షరాలా ₹1,680 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది, ఈ సినిమా భారతీయ మార్కెట్‌లో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇండియాలో ₹1,000 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన మొట్టమొదటి హిందీ చిత్రంగా ‘దురందర్ 2’ చరిత్రకెక్కింది. మూడు వారాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద అదే నిలకడను ప్రదర్శించడం విశేషం. మూడవ వారంలో కూడా ప్రేక్షకులు థియేటర్లకు బారులు తీరుతున్నారు. ముఖ్యంగా వర్కింగ్ డేస్‌లో కూడా ఈ చిత్రం డబుల్ డిజిట్ వసూళ్లను రాబట్టడం దీని సత్తాను చాటుతోంది.

Also Read:Balakrishna : చిన్నారి ప్రాణం కోసం ‘బాలయ్య’ పిలుపు.. ₹16 కోట్ల ఇంజెక్షన్ కోసం విరాళాలివ్వండి!

ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ చిత్రం సత్తా చాటుతోంది. ఇప్పటివరకు ₹404 కోట్లు రాబట్టింది. వెరసి, ప్రపంచవ్యాప్తంగా ₹1,680 కోట్ల భారీ వసూళ్లతో ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. నాలుగో వారంలోకి అడుగుపెడుతున్నా, ఈ సినిమాకు థియేటర్ల వద్ద డిమాండ్ తగ్గడం లేదు. రిపీట్ ఆడియన్స్ పెరగడం, మౌత్ టాక్ బలంగా ఉండటంతో ఈ చిత్రం మరిన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తోంది. భారతీయ సినిమా గ్లోబల్ స్థాయిలో ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో ‘దురందర్ 2’ మరోసారి నిరూపించింది.

Exit mobile version