Site icon NTV Telugu

Web series: ‘దొంగ ముద్దు’ పెట్టబోతున్న ధీరజ అప్పాజీ!

Da

Da

Deeraj Appaji: ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్, అనలిస్ట్ ధీరజ అప్పాజీ ఓ వెబ్ సిరీస్ తో దర్శకుడిగా మారుతున్నారు. ప్రణయ కలహం నేపథ్యంలో రూపొందనున్న ఈ వెబ్ సిరీస్ కి ‘దొంగముద్దు’ అనే టైటిల్ ఖరారు చేశారు. పిఆర్వోగా రెండొందలు పైచిలుకు చిత్రాలకు పని చేసి, ఫిల్మ్ జర్నలిస్ట్ గా తెలుగు చిత్ర పరిశ్రమతో రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం కలిగిన అప్పాజీ రచయిత కూడా. “వెన్నెల కురిసిన రాత్రి, మావయ్య, విప్లవం వర్ధిల్లాలి” వంటి కథలను అప్పాజీ గతంలో రాశారు. పలు సినీ వార పత్రికలకు ఎడిటర్ గా, పలు పాపులర్ వెబ్ సైట్స్ కు కంటెంట్ రైటర్ గా పని చేసిన అప్పాజీ… పలు చిత్రాలలో అతిథి పాత్రల్లో మెరిశారు. ఓ దినపత్రిక సినిమా విభాగం ఎడిటర్ గానూ వ్యవహరించారు. అప్పాజీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘దొంగముద్దు’కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి!

Exit mobile version