NTV Telugu Site icon

Dhanush: ప్రీరిలీజ్ ఈవెంట్ కి ‘సార్’ వస్తున్నాడు…

Dhanush

Dhanush

ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న మొట్టమొదటి బైలింగ్వల్ సినిమా ‘వాతి/సార్’. సితార ఎంటర్తైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. సంయుక్తా హీరోయిన్ గా నటిస్తున్న సార్ మూవీకి జీవీ ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్ చార్ట్ బస్టర్ అయ్యింది. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో హ్యుజ్ హైప్ ని మైంటైన్ చేస్తున్న సార్ మూవీ ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీగా ఉంది. ఇటివలే చెన్నైలో వాతి మూవీ ఆడియో లాంచ్ జరిగింది, ఈ ఈవెంట్ తో వాతి మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. టాలీవుడ్ లో ఆడియో లాంచ్ లు ఆపేసి చాలా కాలమే అయ్యింది కాబట్టి సార్ చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి రెడీ అయ్యారు. నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో సార్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు గ్రాండ్ గా జరగనుంది. ఈ ఈవెంట్ కి ధనుష్ కూడా వస్తుండడంతో, సార్ మూవీ ఓపెనింగ్ డే బిజినెస్ పెరిగే ఛాన్స్ ఉంది.

విజయ్ లాంటి హీరోలు తెలుగులో సినిమాలు చేస్తారు కానీ ప్రమోషన్స్ కి మాత్రం రారు అలా కాకుండా ధనుష్ తన మొదటి బైలింగ్వల్ సినిమాకే తెలుగులో కొంచెం కొంచెం మాట్లాడుతూ, పాటలు కూడా పడుతుండడంతో మన ఆడియన్స్ ధనుష్ కి బాగా కనెక్ట్ అయ్యారు. ధనుష్ యాక్టింగ్ లో ఎలాంటి లోపాలు ఉండవు, ట్రాక్ మార్చాను అని చెప్తున్న వెంకీ అట్లూరి కథలో ఎలాంటి లోపం లేకుంటే చాలు సార్ సినిమా ధనుష్ కి తెలుగులో సాలిడ్ డెబ్యు అవుతుంది. సార్ మూవీ నుంచి ‘వన్ లైఫ్’ అనే సాంగ్ ని మేకర్స్ సర్ప్రైజ్ గిఫ్ట్ గా ఈరోజు రిలీజ్ చేశారు. ధనుష్ లిరిక్స్ రాసిన ఈ సాంగ్ యుట్యూబ్ లో మంచి వ్యూవర్షిప్ ని రాబడుతోంది.