RAAYAN Trailer: గూస్బంప్స్ తెప్పిస్తున్న ధనుష్ రాయన్ ట్రైలర్
- గూస్బంప్స్ తెప్పిస్తున్న ధనుష్ రాయన్
- ధనుష్ కెరీర్ లో 50 వ సినిమా
- ఈ మూవీలో అపర్ణ బాలమురళి
- దుషార విజయన్ కథానాయికలు
- యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రాయన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RAAYAN Trailer: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఈ ఏడాది కెప్టెన్ మిల్లర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీని తరువాత “రాయన్” అనే సినిమా లో నటిస్తున్నారు. ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ధనుష్ కెరీర్ లో ఇది 50 వ సినిమా గా తెరకెక్కుతుండగా.. దీనికి ధనుష్ కథను అందించి దర్శకత్వం వహించడం విశేషం. ఇక ఈ మూవీలో అపర్ణ బాలమురళి, దుషార విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ధనుష్ కెరీర్‌లో 50వ సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, విష్ణు విశాల్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్, ఎస్.జె. సూర్యలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read: Kamal Haasan: వరుస కాల్స్ వస్తున్నాయి.. ఇలా అవుతుందని అనుకోలేదు.. వీడియో రిలీజ్ చేసిన కమల్
Also Read
నార్త్ మద్రాస్ నేపథ్యంలో సాగే యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ పోస్టర్, టీజర్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో జులై 26న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో తాజాగా మేకర్స్ రాయన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో ధనుష్ రక్తంతో తడిచిన చేతితో పిడికిలి బిగించి భీకరంగా కనిపిస్తు చేతిలో కత్తులు ఉండటంతో ఫ్యాన్స్ లో అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్ లో రెహమాన్ తనదైన రస్టిక్ స్టైల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియా వేదికగా ట్రేండింగ్ లో కొనసాగుతుంది.
తాజావార్తలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?