Site icon NTV Telugu

Dhanush: లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ లో ధనుష్…

Captain Miller

Captain Miller

ప్రతి హీరో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తుంటే, ధనుష్ మాత్రం పాన్ ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీలో స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా కథ నచ్చితే సినిమా చేస్తున్న ధనుష్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి వాడు. చాలా చూసిగా కథలు ఎంచుకునే ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కెప్టైన్ మిల్లర్’. రాకీ, ఇరుద్దు సుట్రు లాంటి సూపర్ హిట్ సినిమాలకి రైటర్ గా వర్క్ చేసిన అరుణ్ మాతెశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న కెప్టైన్ మిల్లర్ సినిమాలో సందీప్ కిషన్ కూడా నటిస్తున్నాడు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న కెప్టైన్ మిల్లర్ సినిమాపై కోలీవుడ్ లో భారి అంచనాలు ఉన్నాయి.

Read Also: Akshay Kumar: ఈసారి హిట్ కొట్టడం గ్యారెంటీ…

ఆ అంచనాలని మరింత పెంచుతూ మేకర్స్ కెప్టైన్ మిల్లర్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో కెప్టైన్ మిల్లర్ ఏ రేంజులో తెరకెక్కుతుంది అనే విషయంలో చిన్న సాంపిల్ చూపించారు. ఈ నిమిషమున్నర వీడియోకే జీవీ ప్రకాష్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఈ మేకింగ్ వీడియో ఎండ్ లో సింగల్ బారెల్ గన్ పట్టుకోని నిలబడి ఉన్న ధనుష్ ని లైట్ గా రివీల్ చేశారు. ఈ మేకింగ్ వీడియోలో టెక్నిషియన్స్ ఎఫోర్ట్, ధనుష్ లుక్, సెట్ లోకేషన్స్ చూస్తుంటే ధనుష్ KGF లాంటి లార్జర్ దెన్ లైఫ్ సినిమాలోనే నటిస్తున్నట్లు ఉన్నాడు. రైటర్, డైరెక్టర్ లో సత్తా ఉండాలి కానీ ఎలాంటి సీన్ ఇచ్చినా పెర్ఫార్మెన్స్ చెయ్యగల ధనుష్, కెప్టెన్ మిల్లర్ సినిమాతో ఏం చేస్తాడో చూడాలి.

Read Also: Box Office War: ఒకే డేట్ కి రానున్న ముగ్గురు సూపర్ స్టార్స్

Exit mobile version