Site icon NTV Telugu

Kuberaa Censor : ‘కుబేర’ సెన్సార్. ధనుష్ ఫ్యాన్స్ నజర్.. ఎందుకంటే.?

Dhanush

Dhanush

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చేస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా కుబేర. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఏషియన్ సినిమాస్ సునీల్, రామ్ మోహన్ రావ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ రాబట్టడమే కాకుండా సినిమాపై అంచనాలు పెంచింది అనే చెప్పాలి.

ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో వస్తున్న కుబేర జూన్ 20న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఫినిష్ చేసుకుంది. మొత్తం 3 గంటల 15 నిమిషాల నిడివి వచ్చిందట. దాంతో 14 నిమిషాలు ట్రిమ్ చేసి లాక్ చేశారట. సినిమా చుసిన సెన్సార్ సభ్యులు చిన్న చిన్న మార్పులు చేర్పులు సూచించి U/A సర్టిఫికెట్ అందజేసారు. కానీ ఈ సినిమా రన్ టైమ్ ధనుష్ ఫ్యాన్స్ ను కాస్త టెన్షన్ పెడుతుంది. 3 గంటలకు పైగా రన్ టైమ్ అంటే కాస్త ఇబ్బందే. సినిమా బాగుంటే ఓకే లేదంటే మొదటికే మోసం వస్తుందని కామెంట్స్ వస్తున్నాయి. ఇండియన్ 2, కంగువ, రెట్రో వంటి సినిమాలు ఎక్కువ రన్ టైమ్ తో వచ్చి ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించాయి. కానీ శేఖర్ కమ్ముల పై ధనుష్ చాలా నమ్మకంగా ఉన్నాడు. కుబేర ఊహించిన దానికంటే భారీ హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. తెలుగు, తమిళ్ లో కుబేర రిలీజ్ కు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసారు.

Exit mobile version