ఇటీవల ‘కుబేర’తో హిట్ సాధించిన ధనుష్, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇడ్లీ కొట్టు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అక్టోబర్ 1న విడుదల కానున్న ఈ సినిమా కోసం ఇటీవల ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధనుష్ తన చిన్నతనపు జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఎమోషనల్‌గా మాట్లాడారు.
Also Read : Sonarika Bhadoria : ‘మహాదేవ్’ ఫేమ్ సోనారికా గుడ్ న్యూస్..
‘‘నా చిన్నతనంలో రోజూ ఇడ్లీ తినాలనిపించేది. కానీ అప్పట్లో డబ్బులు లేవు. ఇప్పుడు డబ్బులు ఉన్నా, చిన్నతనంలో తిన్న ఇడ్లీ ఆనందం, రుచి ఇప్పటి రెస్టారెంట్లలో లేను. ఈ సినిమా నిజ జీవితం ఆధారంగా రూపొందింది. చాలా మందికి స్ఫూర్తి నిస్తుంది’’ అని ధనుష్ తెలిపారు. అతను ట్రోల్స్‌పై కూడా స్పందించారు. ‘‘అసలు హేటర్స్ అనే కాన్సెప్ట్ లేదు. అందరూ హీరోల సినిమాలు చూస్తారు. కానీ కొందరు 30 మంది టీమ్ లా ఏర్పడి 300 ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి ద్వేషం వ్యక్తం చేస్తారు. కానీ వారు సినిమా చూస్తారు. బయట కనిపించే దానికి రియాలిటీ చాలా తేడా’’ అని చెప్పారు. ఇదే వేదికపై ధనుష్ మరో సినిమా ప్రకటన చేశారు. త్వరలోనే వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వడ చెన్నై’ సీక్వెల్లో నటించనున్నట్లు తెలిపారు. ఇడ్లీ కొట్టు సినిమాకు ధనుష్ సరసన నిత్యామీనన్ నటిస్తున్నారు. విజయవంతమైన ‘తిరు’ తర్వాత వీరిద్దరి కలయిక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అలాగే ప్రకాశ్‌రాజ్, షాలినీ పాండే తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా గ్రామీణ నేపథ్యం తో రూపొందుతుంది.
