Dhanush : ధనుష్ ‘DxV’ క్రేజీ పోస్టర్.. అసలు ఆ డైరెక్టర్ ఎవరు?

Dhanush (2)

Dhanush (2)

కోలీవుడ్‌లో హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ పోయే ఏకైక స్టార్ హీరో ధనుష్. రీసెంట్‌గా ‘కర’ సినిమాతో పలకరించిన ధనుష్, ప్రస్తుతం రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఓమ్’ షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే తమిళరసన్ పచ్చముత్తు, మారి సెల్వరాజ్ వంటి క్రేజీ దర్శకులు ఆయన కోసం లైన్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ధనుష్ తన సోషల్ మీడియా ఖాతాలో వదిలిన ఒక అప్‌డేట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ధనుష్ తన ఎక్స్ ఖాతాలో DxV అనే అక్షరాలతో ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను షేర్ చేశారు. జూలై 10న దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తామని డేట్ లాక్ చేశారు. అంతరిక్షం లేదా టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌ను తలపించేలా ఉన్న ఈ పోస్టర్ చూసి ఫ్యాన్స్ రకరకాల అంచనాలు వేస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్ డైరెక్ట్‌గా ఈ పోస్టర్ వేసి ఉంటే ఈజీగా గెస్ చేసేవారేమో కానీ, ధనుష్ స్వయంగా ఈ సస్పెన్స్‌ను మెయింటైన్ చేయడంతో నెట్టింట విపరీతమైన చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఈ ‘DxV’ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో ప్రధానంగా రెండు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ ‘V’ అంటే దర్శకుడు వెంకట్ ప్రభు అని, వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ లేదా టైమ్ ట్రావెల్ ఎంటర్‌టైనర్ రాబోతుందని మెజారిటీ ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. గతంలో శివకార్తికేయన్‌తో అనుకున్న కథను ఇప్పుడు ధనుష్‌తో చేయబోతున్నారనే బజ్ కూడా ఉంది. మరో ఆసక్తికరమైన ఏంటంటే గతేడాది ’12త్ ఫెయిల్’ సినిమాతో సంచలన విజయం అందుకున్న బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ విధు వినోద్ చోప్రాతో ధనుష్ చేతులు కలపబోతున్నారనే ప్రచారం కూడా గట్టిగా సాగుతోంది. దీనితో పాటు ధనుష్ తన నెక్ట్స్ డైరెక్టోరియల్ సినిమాను అనౌన్స్ చేస్తున్నారా? లేక గతంలో చర్చకు వచ్చిన పీరియాడిక్ డ్రామా ‘వేల్పారి’ గురించా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఈ ‘DxV’ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.